సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే చిరు ధాన్యాలు మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాల్సిందేనని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ అంటున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో "సిరిధాన్యాలు, కషాయాలతో సంపూర్ణ ఆహారం - ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలన"పై జరిగిన అవగాహన కార్యక్రమానికి డాక్టర్ ఖాదర్ వలీ ముఖ్య అతిధిగా వచ్చారు. జీవన సరళి వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే 9 మాసాలు చిరుధాన్యాలు తింటే సర్వరోగాలు నివారించవచ్చని డాక్టర్ ఖాదర్ వలీ తెలిపారు.


చిరుధాన్యాల వంటల తయారీపై 'పాకసిరి పుస్తకం', ప్రయోజనాలపై 'సిరిధాన్యాలు" పేరిట పుస్తకాలు అందుబాటులోకి తెచ్చిన దృష్ట్యా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఖాదర్ వలీ  సూచించారు. 40 ఏళ్ళకే గుండెపోటు మరణాలు చూస్తున్న వేళ వంటిట్లో అరికలు, ఊదలు, సామలు, అండుకొర్రలు, కొర్రలు ఉంచుకుంటూ టీ‌ బదులు అంబలి తాగితే హైదరాబాద్ ఆరోగ్య నగరంగా పరుగులు తీస్తుందని డాక్టర్ ఖాదర్ వలీ అన్నారు. పిజ్జా,బర్గర్లకు బదులు చిరుధాన్యాలు తింటే రైతుకు ఆదాయం లభించి పర్యావరణం బాగుంటుందని డాక్టర్ ఖాదర్ వలీ  పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: