తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 37 డిగ్రీల వరకు నమోదువుతున్న ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణలో ఎక్కువగా ఎండల తీవ్రత అధికంగా ఉందని.. మార్చి 15 నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


ఏప్రిల్‌ తరువాత తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 12 నుంచి 13 ఆటోమేటిక్‌ వేదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని.. మిగతా జిల్లాల్లో వేదర్‌ స్టేషన్ల కోసం ప్రాజెక్టు సిద్ధం చేశామని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆటోమేటిక్‌ వేదర్‌ స్టేషన్ల వల్ల సమాచారం ఖచ్చితత్వంగా ఉంటుందని.. గంటగంటకు వాతావరణ సమాచారాం తెలుస్తోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది. అందుకే తగిన జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్లకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: