ఆడ పిల్లల కోసము మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల రకాల సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొని వస్తున్నది.. ఇటీవల ఆడ పిల్లలకు కూడా ప్రత్యేమైన స్కీమ్స్‌ను ఆవిష్కరించడం జరిగింది. ఆడపిల్లల కోసం సంక్షేమ పథకం అనేసరికి వెంటనే మనకందరికీ గుర్తుకు వచ్చేది సుకన్య స్కీమ్. ఈ పథకం చాలా ప్రాధాన్యమును సంతరించుకున్నది. ఈ  స్కీమ్స్‌ కాకుండా చిన్నారుల కోసం మరో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కూడ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది.

 

  దీని పేరు బాలిక సమృద్ది యోజన పథకము. ఈ పథకానికి, సుకన్య సమృద్ది అకౌంట్‌కు చాలా  తేడాలు ఉంది. ఇక సుకన్య సమృద్ది యోజన పథకములో ఆడ పిల్లల పేరునా  ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్  చేసుకుంటూ రావాలి. అయితే బాలిక సమృద్ది యోజనలో ఎటువంటి  డబ్బు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే అప్లై చేసుకున్న చిన్నారుల పేరుపై అకౌంట్‌లో డబ్బులు వేస్తూ ఉంటుంది.

 

గతంలో కేంద్ర ప్రభుత్వం స్కూళ్లలో ఆడ పిల్లల సంఖ్యను పెంచడానికి బాలిక సమృద్ది స్కీమ్‌ను అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ సుకన్య సమృద్ది అకౌంట్ గురించి మాట్లాడుకుంటే... ఈ పథకం ఆడ పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేందుకు విడుదల చేయడం జరిగింది. అందువల్ల రెండింటికీ వ్యత్యాసం చాల ఉంది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే  గ్రామాల్లో అంగన్‌వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్‌ అప్లికేషన్ ఫిల్ చేసి పథకంలో సులభంగా చేరవచ్చు. ఇక పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ లభిస్తాయి. స్కీమ్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్  చేసుకొని అప్లై చేసుకోవచ్చు.  ఇంక ఎందుకు ఆలస్యం త్వరగా అప్లై చేసుకొని పథకం వల్ల వచ్చే లాభాలు పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: