ఆర్బిఐ పాలసీని నియమాల  నేపథ్యంలో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్ లకు బాగా డిమాండ్ పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ దూసుకు వెళుతున్నాయి. ఇక నేడు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 327 పాయింట్లు బలపడి 40509  పాయింట్ల వద్దకు ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 11 914 వద్ద ముగిసింది. ముఖ్యంగా వివిధ కంపెనీల క్యూ ఫోర్ నుంచి జిడిపి రికవరీ బాట పట్టడంతో భారతీయ కంపెనీలు షేర్లు లాభాల వైపు పరుగులు పెడుతున్నాయి. ఇకపోతే నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో ప్రైవేట్ బ్యాంక్స్ అలాగే పీఎస్యూ షేర్లు మూడు శాతం పైగా లాభపడగా ఐటీ పరిశ్రమకు సంబంధించిన నిఫ్టీ ఐటి కూడా కొద్ది మేర లాభపడింది. ఎఫ్ఎంసిజి, ఫార్మా, మెటల్, మీడియా కోర్ నిఫ్టీ ఇండెక్స్ లు నష్టాల బాట పట్టాయి.


ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో లాభనష్టాలు విషయానికి వస్తే... ముందుగా అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్ల వివరాలు చూస్తే.. విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లు అత్యధికంగా లాభపడిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో అత్యధికంగా విప్రో కంపెనీ నాలుగు శాతం పైగా లాభపడింది. ఇక అత్యధికంగా నష్టపోయిన వాటిలో గ్రాసిమ్, హిందాల్కో, యుపిఎల్, సన్ ఫార్మా, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇందులో గ్రాసిమ్ కంపెనీకి సంబంధించి అత్యధికంగా 3.2 శాతం షేర్ వాల్యూ నష్టపోయింది.


ఇక నేటి మార్కెట్లో దేశి దిగ్గజ ఐటీ కంపెనీలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ శుక్రవారం నాడు అసెన్సార్ ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ప్రస్తుతం టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 144 . 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: