మాములుగా ఏదైనా హోటల్ కు వెళ్ళినా.. రెస్టారెంట్ కు వెళ్ళినా కూడా తిన్న తర్వాత బిల్లు చెల్లించాలి..అంతేగా మరి.. కానీ ఓ రెస్టారెంట్ లో ఎంత తిన్నా బిల్ కట్టక పోయిన పర్వాలేదని అంటున్నారు. అయితే ఆ హోటల్ కు గల ప్రత్యేకత ఎంటి ఎందుకు అలా ఉచితంగా భోజన సదుపాయం అందిస్తున్నారు. అనే అంశాలు అందరినీ ఆలోచనలో పడేసింది. అంతేకాదండోయ్ దీనికి వెనుక ఏదో రహస్యం ఉంది అంటూ సమాచారం. అదేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..



ఈ రెస్టారెంట్ అహ్మదాబాద్‌లో ఉంది. ఆ రెస్టారెంట్ పేరు సేవా కేఫ్.. ఆ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ అక్కడ పదకొండేళ్ల నుంచి కొనసాగుతుంది.ఫుడ్ తిన్న వారు వాళ్లకి నచ్చిన మొత్తాన్ని చెల్లిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కొంత మంది చెల్లించపోవచ్చు. మరికొంత మంది కొంచెం ఎక్కువగానే చెల్లించొచ్చు.  ఈ విధంగా ఈ రెస్టారెంట్ బిజినెస్ అధ్బుతంగా కొనసాగుతుంది. నాలుగు రాళ్లు వెనకేసుకొచ్చు అనే ఆలోచనతో ఎవరైనా రెస్టారెంట్ ను మొదలు పెడతారు. కానీ ఈ రెస్టారెంట్ మాత్రం సేవ కోసం నడిపిస్తున్నారు. ఆకలి అన్న వాడి కడుపు నిప్పంపడం కోసం దీనిని నడిపిస్తున్నారు.



ఈ కేఫ్‌ను మానవ్ సాధన్ అండ్ స్వచ్ సేవా సాధన్ అనే ఎన్‌జీవో నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రెస్టారెంట్ తెరిచి ఉంటుంది. ఆదివారం నుంచి గురువారం వరకు అంటే వారంలో ఐదు రోజులకు వచ్చిన ఆదాయాన్ని ట్రస్ట్ కు పంపిస్తారట..మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ రెస్టారెంట్ లో పనిచేసే వాళ్లకు ఎలాంటి జీతాలు ఉండవు. స్వచ్ఛందంగా సేవ చేస్తారు. ఆ ప్రాంతంలోని విద్యార్థులు,టూరిస్టులు, మిగిలిన వారు వీరి సేవ నచ్చడంతో తో అక్కడ పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారికి నచ్చిన పనిని అంటే వండటం,వడ్డించడం, తిన్న ప్లేట్స్ క్లీన్ చేయడం లాంటివి చేస్తుంటారు. వినడానికి బాగుంది కదూ..అవునండీ మానవత్వం కరువవుతున్న ఈ రోజుల్లో ఇలా చేయడం నిజంగా గ్రేట్...

మరింత సమాచారం తెలుసుకోండి: