ఎల్పీజీ వినియోగదారులకు పేటీఎం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం పది, పదంటే పది రూపాయిలకే గ్యాస్ సిలిండర్ పొందే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రాంతాన్ని బట్టి 800 నుంచి 900 మధ్యలో లభిస్తోంది. కానీ ఇలా చేస్తే పది రూపాయిల్లో పొందే అవకాశం కూడా ఉంటుంది. దీని కోసం ముందుగా మీరు పేటీఎం యాప్లో గ్యాస్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ‘ఫస్ట్ ఎల్పీజీ’ అని ఇంగ్లీష్ అక్షరాలలో ప్రోమో కోడ్ వస్తుంది.

దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. తరువాత ఆ  ప్రోమో కోడ్ ను పేటియం ప్రోమో భాగంలో రాయాల్సి ఉంటుంది. భారత్, ఇండియన్, హెచ్పీ కంపెనీల 14.2 కేజీల గ్యాస్ సిలిండర్పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ కంపెనీల సిలిండర్లపై పేటీఎం 800 రూపాయిల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే గ్యాస్ వినియోగదారులు రిఫిల్ కోసం రూ.9 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే హెచపీ గ్యాస్ వినియోగదారులు, ఇతర గ్యాస్ కంపెనీల వినియోగదారులు పేటీఎం ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లింపులు జరిపే అవకాశం ఉంటుంది.

ముందుగా పేజీఎం యాప్లోకి వెళ్లి, గ్యాస్ బుకింగ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తరువాత అక్కడ కన్జుమర్ నెంబర్ ఎంటర్ చేయాలి అనంతరం గ్యాస్ ఏజెన్సీ సెలక్ట్ చేసుకొని, కంట్యూన్యూ ను క్లిక్ చేయాలి. తరువాత బుకింగ్ మొత్తాన్ని ఎంటర్ చేయాలి. తరువాత మీకు ఇఫ్టం వచ్చిన విధంగా అంటే.. క్రెడిట్కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మనీ పే చేయాలి. అనంతరం ఈ ప్రక్రియను మొత్తం ఫినిష్ చేయాలి. ఇలా చేస్తే మీ గ్యాస్ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా స్టెబ్ బై స్టెప్ పేటీఎంలో జాగ్రత్తగా బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మీకు కేవలం పది రూపాయిలకే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బుక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: