



బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లు టెక్ ఆధారిత స్టార్టప్ ఎకోసిస్టం వృద్ధి తో ముందు వరుసలో సాగుతున్నాయి. అంతేకాదు ఈ నగరాలు మేజర్ టెక్, తయారీ రంగం , ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్ లుగా కూడా రూపొందుతున్నాయి. అయితే ప్రపంచంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే, ఇండియన్ నగరాల్లో ఆర్థిక ఉత్పాదన తక్కువే. అయితే మున్ముందు ఈ పరిస్థితి మారుతుందని సర్వే లో అభిప్రాయం వ్యక్తం అయ్యింది. 2035 నాటికి చైనా నగరాల కంటే 18 శాతం ఎక్కువ ఆర్థిక ఉత్పాదన ఉంటుందన్నారు.
ప్రపంచంలోని మొదటి 10 పెద్ద నగరాల పరిస్థితి లో పెద్దగా మార్పు ఉండబోదని తెలిపారు. 2025-2035 మధ్య అమెరికా లోని న్యూయార్క్ లీడ్ లో ఉంటే, ఆ తర్వాత టోక్యో , లాస్ ఏంజెల్స్,బీజింగ్, లండన్ , షాంగై నగరాలు నిలుస్తాయి. ఏది ఏమైనా ఇండియన్ నగరాలు సమీప భవిష్యత్తులో అగ్రస్థానాల్లో నిలుస్తాయన్నది సంతోష కర విషయం.