ఇక ప్రతి ఒక్కరూ కూడా మెరుగైన జీవితాన్ని కోరుకుంటారు. వారి భవిష్యత్తు చాలా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటుంటారు.అలాగే మీరు కూడా రానున్న రోజుల్లో సంతోషంగా ఉండాలని భావిస్తున్నట్లయితే మీకు ఎల్ఐసీ ఒక మంచి పాలసీని అందుబాటులో ఉంచుతోంది.ఈ ప్లాన్ కింద పాలసీదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఒక్కసారి ప్రీమియం అనేది చెల్లించాలి. అంటే.. ఒక్కసారి చెల్లించిన ప్రీమియం ద్వారా అతను జీవితాంతం పెన్షన్ అనేది పొందుతారు.సరళ్ పెన్షన్ స్కీమ్ పాలసీని రెండు విధాలుగా తీసుకోవచ్చు. మొదటగా సింగిల్ లైఫ్ పాలసీ ఇంకా రెండవది జాయింట్ లైఫ్ పాలసీ. ఇక సింగిల్ లైఫ్ పాలసీలో పాలసీదారు ఉన్నప్పుడే పెన్షన్ అందుకోవడం కొనసాగుతుంది. పెన్షన్ హోల్డర్ మరణించిన తర్వాత, బేస్ ప్రీమియం మొత్తం కూడా నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది. ఇంకా అదే జాయింట్ లైఫ్ పాలసీలో ఎవరు ఎక్కువకాలం జీవించి ఉంటారో వారికి పెన్షన్ అనేది అందుతూనే ఉంటుంది. ఈ పెన్షన్ చెల్లింపులో ఎలాంటి కోత ఉండదు.ఇద్దరూ కనుక మరణిస్తే.. నామినీకి ప్రీమియంని చెల్లిస్తారు.ఈ సరల్ పెన్షన్ యోజన పాలసీ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇన్సూరెన్స్ సైట్ లో హోమ్ పేజీకి వెళ్లి సరళ్ పెన్షన్ యోజన ఎంపికపై మీరు క్లిక్ చేయాలి. ఆ తరువాత దరఖాస్తు ఫారమ్ లో మీ పేరు, వయస్సు ఇంకా మొబైల్ నంబర్ మొదలైన అన్ని అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఆ తరువాత అక్కడ అడిగిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా జోడించి తరువాత సబ్మిట్ ఆప్షన్‌పై మీరు క్లిక్ చేయాలి.ఇక lic కాలిక్యులేటర్ ప్రకారం మీ వయస్సు 42 ఏళ్లనుకుంటే.. మీరు మొత్తం రూ.30 లక్షల యాన్యుటీని కొనుగోలు చేసినట్లయితే మీకు ప్రతి నెలా రూ.12,388 పెన్షన్ వస్తుంది. యాన్యుటీపై ఎలాంటి గరిష్థ పరిమితి అనేది లేదు. 40 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు కూడా ఈ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ కింద కనీస వార్షికాదాయం సంవత్సరానికి మొత్తం రూ.12,000గా ఉంది. ఇక ఈ ప్లాన్ కింద మీరు నెలవారీ పెన్షన్ ప్రయోజనం పొందాలనుకుంటే, ప్రతి నెలా కనీసం వెయ్యి రూపాయలు ఖచ్చితంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: