ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అలాగే పెన్షనర్లకు మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ పథకం గడువును 2022 ఆగస్టు 1వ తేదీ నుండి 2023 మార్చి 31వరకూ పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి ఎంటీ క్రిష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన అనంతరం మరికొంత కాలం పాటు దీన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఇహెచ్‌ఎస్‌)తో పాటు మెడికల్‌ రిఎంబర్స్‌ మెంట్‌ స్కీంను కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఇహెచ్‌ఎస్‌ పథకాన్ని సులభతరం చేసేందుకు అనువైన విధానాల్ని అందుబాటులోకి తేవాలని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సిఇఒకు సూచించారు. ఇందుకు సంబంధించి ఆరోగ్య శ్రీ సిఇవో అవసరమైన చర్యల్ని తీసుకోవడంతో పాటు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు , పెన్షనర్లు ఎటువంటి సమస్యలకు గురికాకుండా ఉండేందుకు గాను తగిన యంత్రాంగాన్ని ఆరోగ్యశ్రీ సిఇవో ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆర్థిక శాఖ సమ్మతి మేరకే ఈ ఉత్తర్వుల్ని జారీ చేశామని కృష్ణ బాబు స్పష్టం చెయ్యడం జరిగింది.


మెడికల్‌ రీ ఎంబర్స్‌ మెంట్‌ కాలపరిమితి ఈ ఏడాది ఆగస్ట్‌ 31వ తేదీతో ముగియడంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఎంను కలిసి మెడికల్‌ రీఎంబర్స్‌ మెంట్‌ గడువు పొడిగించాల్సిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గడువు పెంపునకు ఆమోదించారు. ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈహెచ్‌ఎస్‌ కార్డులపై నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌లో పూర్తిస్థాయిలో వైద్యం అందే వరకు ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వుల గడువు ముగిసేలోపే మరలా కొనసాగింపు ఉత్తర్వులు మంజూరు చేయాలని ఉద్యోగ సంఘం ఆంధ్రప్రదేశ్ జేఏసీ నాయకులు బొప్పరాజు, వైవీరావు ప్రభుత్వాన్ని కోరారు. మెడికల్‌ రీఎంబర్స్‌ మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు 1-8-2022 తరువాత వైద్యం చేయించుకున్న వారు మెడికల్‌ బిల్స్‌ను ప్రొసెస్‌ చేసుకోవాల్సిందిగా వారు సూచించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: