ప్రకృతిలో ఎన్నో వృక్షసంపద చూస్తుంటాం..వాటితో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి వరధాయని వేపచెట్టు. ఈ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెట్టు బాగా పెద్దది కావడం వల్ల చల్లని నీడ ఇస్తుంది..వేప పుల్లతో మనం దందాలు శుభ్రం చేసుకుంటాం...వేప కాయలతో నూనె తయారు చేస్తారు. అంతే కాదు వేప చెట్టు మంచి ఔషదంగా కూడా పనిచేస్తుంది. వేప అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కానీ.. చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా చాలా పవర్ ఫుల్ గా మనిచేస్తుంది. జుట్టు సంరక్షణలో చక్కగా పనిచేసే వేప.. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ నివారించడంలోనూ.. చక్కగా ఉపయోగపడుతుంది. 


వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు :


వేప నూనె మీ వయసు ఛాయలు కనిపించకుండా.. యంగ్ లుక్ అందిస్తుంది. వేప నూనెను ముఖానికి తరచుగా అప్లై చేస్తూ ఉంటే... ముడతలు తగ్గిపోతాయి. 


వేపనూనె జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. వేప నూనెతో అప్పుడప్పుడు తలకు మసాజ్ చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. లేదా కాస్త వేడిచేసి మసాజ్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. 


 వేపనూనెను ఫేస్ మాస్క్ లా ఉపయోగిస్తే.. యాక్నె సమస్య తగ్గిపోతుంది. ఇది బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. 


జుట్టు రాలడాన్ని, చిట్లిపోవడాన్ని వేపనూనె చక్కగా పరిష్కరిస్తుంది. వేప నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసుకుంటూ ఉంటే.. ఈ సమస్య తగ్గిపోతుంది. 


వేప ఆయిల్ బరువు తగ్గడానికి కూడా చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అయితే దాని రుచి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి.. కష్టమైనా.. తీసుకుంటే.. బరువు తగ్గవచ్చు. 


పొడి జుట్టికి పొడిబారి, రఫ్ గా మారిన జుట్టుని ట్రీట్ చేయడంలో వేప నూనె చాలా బాగా పనిచేస్తుంది. షాంపూలో కొన్ని చుక్కల వేప నూనె కలిపి.. అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.


వేప నూనెతో చర్మానికి మసాజ్ చేస్తే.. పొడిబారిన చర్మం స్మూత్ గా తయారవుతుంది. 


వేప నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తలకు మసాజ్ చేస్తే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గి.. చుండ్రు తగ్గిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: