మగువలకు శిరోజాలే అందం. ముఖానికి అందాన్నివ్వడమే కాదు, తలకు రక్షణ కూడా, కేశాలకు సంబంధించి కొంతమంది ఎన్ని జాగత్తలు తీసుకున్నా పొడువుగా పెరగదు. కొందరికి ఒత్తుగా, ఉంగరాలుగా ఉంటుంది. కొంతమందికి భుజాల వరకు ఉంటుంది. బుద్దివంతుల జుట్టు భుజాలు దాటదంటారు, అది వేరే విషయం.  కాని పొడవాటి జుట్టే అందరినీ ఆకర్షిస్తుంది. ఆడపిల్లలు లంగా-జాకెట్టు లేదా లంగా ఓణి, పెద్ద జడతో ఉంటే చూడముచ్చటగా ఉంటారన్నది నిర్వివాదాంశం. నేడు ఫేషన్ల పేరిట పెద్ద జుట్టు ఉన్నా కత్తిరించుకుంటున్నారు. ఎవరి అభిరుచి వాళ్లది మరి!  మనిషి ఆరోగ్యానికి శిరోజాలకు సంబంధం ఉంది. శరీరం బలహీన పడినప్పుడు... జబ్బుచేసినా, స్త్రీలకు ప్రసవం తరువాతా జుట్టు ఊడిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నవారి జుట్టు చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టు నిస్తేజంగా ఉంటే ఆరోగ్యం లోపించదన్నమాట! శిరోజాలు చక్కగా పెరగడానికి ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ తగుపాళ్ళలో శరీరానికి అందకపోతే ఆ ప్రభావం శిరోజాలపై ఉంటుంది. శిరోజాలు తొంభై ఎనిమిది పాళ్ళు ప్రొటీన్ నిర్మితాలే!  అందుకే మనం తీసుకునే ఆహారం ప్రొటీన్లతో కూడి ఉండాలి. ఇవి శాకాహారం, మాంసామారం ద్వారా కూడా లభ్యమవుతాయి. పాలు, వెన్న, పెరుగు, గుడ్లు మొదలైనవి ఆహారంలో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. శిరోజాలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. శిరోజాలు అందంగా, కాంతివంతంగా ఉండాలంటే ఆహారంలో తగినంత క్రొవ్వు పధార్థాలు.... సన్ ఫ్లవర్ వంటి నూనెలు, వనస్పతి (డాల్డా), కొబ్బరి నూనె వాడాలి. శిరోజాల ఆరోగ్యానికి మరొక ముఖ్యమైన పధార్థం కార్బోహైడ్రేట్లు. ఇవి గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, దంపుడు బియ్యం, తాజా పండ్లలో లభిస్తాయి. చాక్లెట్లు, జామ్ లు, సాప్ట్ డ్రింకులు ఎక్కువగా తీసుకుంటే కార్బోహైడ్రేట్లు తగ్గి, శిరోజాల నలుపు రంగు తగ్గుతుంది. అలాగే శరీరానికి తద్వారా శిరోజాలకి విటమిన్లు పుష్కలంగా లభించాలి. విటమిన్లు పుష్కలంగా లభించాలి. విటమిన్ ‘ఏ’, బి కాంప్లెక్స్, విటమిన్ ‘ఇ’ తగినంతగా తీసుకోవాలి. ఇవి నారింజ వంటి ఫలాల్లో అధికం. ఇవిగాక మనం రోజూ తినే పధార్థాలలో ఐరన్, జింక్ కూడా శరీరానికి అందాలి. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీరు తాగాలి. ఉదయాన్నే గోధుమ పిండి, గోధుమ రవ్వలతో చేసిన పధార్థాలు ఫలహారం (టిఫిన్)గా తీసుకుంటే మంచిది. చిక్కుడు, సోయాబిన్ కూడా శిరోజాలకు బలాన్నిస్తాయి. ఆహాక నియమాలు పాటించాలి. లేకుంటే దాని ప్రభావం వల్ల జుట్టు ఊడిపోవడం, పాలిపోవడం. త్వరగా తెల్లబడిపోవడం జరుగుతుంది. కవులు శిరోజాలను తుమ్మెద రెక్కలతో పోలుస్తారు. మరి, పైన చెప్పిన విషయాలను అమలు జరిపి అమ్మాయిలు చక్కటి శిరోజాలతో... పెద్ద జడతో చక్కగా బాపూగారి బొమ్మల్లో అమ్మాయిల్లా.. ఆకర్ణణీయంగా ఉండడానికి ప్రయత్నించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: