వర్షాకాలంలో సరదాగా తడవడం అందరికి అలవాటే. ఎంత వర్షం పడుతున్నా సరే తడుచుకుంటూ అలా హాయిగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి వర్షం పడే సమయంలో కనీసం కాలు బయట పెట్టాలంటేనే చిరాకుగా ఉంటుంది. ఏది ఏమైనా వర్షం పడుతున్నా సరే  దైనందిక కార్యక్రమాలు చేయాల్సిందే ఈ క్రమంలోనే జట్టు తడవటం కూడా జరుగుతుంది. జుట్టు తడిచిన ప్రతీ సారి చాలా మంది నిర్లక్ష్యంగా వదిలేస్తారు. లేదంటే పైపైన మాత్రమే తుడుచుకుంటారు. ఇలా చేయడం వలన

 Related image

తలపై అంటే జుట్టు మొదళ్ళలో తేమ పేరుకుపోయి, జిడ్డుగా మారి జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంటాయి. సహజంగానే మనం తలంటుకున్నప్పుడు తప్పకుండా జుట్టుని శుభ్రంగా ఆరబెట్టుకుంటాం ఇదే పద్దతిని వర్షాకాలంలో తడిచిన సమయంలో కూడా ఆచరించాలి. ఎప్పుడైతే తేమ జుట్టు మొదలుకి పట్టి ఉంటుందో అప్పుడు జుట్టు రాలిపోవడం జరుగుతుంది.

 Image result for wet hair with sambrani

అయితే చాలా మంది జుట్టు ఆరబెట్టడానికి హెయిర్ డ్రై లు వాడుతూ ఉంటారు. దీనివల్ల జుట్టు సహజత్వం కోల్పోయి ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టుని సహజ పద్దతుల్లోనే ఆరబెట్టుకోవాలి. పూర్వం జుట్టు ఆరబెట్టుకోవడానికి సాంబ్రాణి పొగని వేసుకునే వారు. దీనివల్ల జుట్టు బిగుతుగా మారడమే కాకుండా ఆ పొగ జుట్టు మొదలుకి చేరుకొని తేమని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో జుట్టు తొందరగా ఆరడమే కాకుండా బలంగా తయారవుతుంది. ఈ పద్దతిని ఎక్కువగా వర్షాకాలంలో పాటిస్తూ ఉంటారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: