ప్ర‌స్తుత రోజుల్లో తెల్ల జుట్టుతో చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవాలని అందరికి ఉంటుంది. కాని తోందరపాటు వల్ల షాంపులు వాడడం వల్ల జుట్టు నల్లబడకుండా, మరో సమస్య చుండ్రు రావడం మొదలౌవుతుంది.జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. కానీ ఆహారపరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి.
అలాగే వాతావారణ కాలుష్యం కూడా దీనికి ఓ కారణం. తీసుకునే ఆహారంలో లోపాలు,  మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి పలు కారణాలు కావచ్చు. అయితే తెల్ల జుట్టుకు చెక్ పెట్టేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..


- ఎండిన ఉసిరి కాయలను కొబ్బరినూనెలో వేసి, కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత రాత్రంతా దాన్ని అలాగే వదిలేయండి. ఉదయం లేచిన తర్వాత ఆ నూనెను తలకు రాసుకోండి. ఉసిరికాయలు కలిపిన కొబ్బరినూనె రోజూ రాసుకుంటే తెల్ల వెంట్రుకల సమస్యే ఉండదు.


- కోడిగుడ్డు, కీరదోస, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను మిక్సీలో వేసి పేస్టులా చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 15 నిమిషాలపాటు ఉంచి తర్వాత షాంపూ చేసుకోండి. నెలకోసారి ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టును నివారించ‌వ‌చ్చు.


- రెండు మూడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ లా చేసి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


- తోటకూర ఆకులను బాగా రుబ్బి, ముద్దగా చేసుకుని.. ఈ మిశ్ర‌మాన్ని తలకు రాసుకుని రెండు గంటల తర్వాత స్నానం చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.


- పాలు కలపకుండా కప్పు బ్లాక్‌ టీ తీసుకొని, అందులో టేబుల్‌ స్పూన్‌ ఉప్పు వేసి, కలపండి. దాన్ని గోరువెచ్చగా వేడిచేసి, దాన్ని తలకు పట్టించి.. నెమ్మదిగా మసాజ్‌ చేయండి. ఇలా చేస్తే తెల్ల వెంట్రుకల సమస్య త‌గ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: