అందంగా.. ఆక‌ర్ష‌నీయంగా క‌నిపించాల‌ని అంద‌రికీ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అనేక ర‌కాల ఫేస్ క్రీములు వాడుతుంటారు. కానీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. వాస్త‌వానికి ఇంట్లో దొర‌కే వ‌స్తువుల‌తో స‌హ‌జ‌సిద్ధంగా అందాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా..


- పాలు, శనగపిండి, పసుపు బాగా కలుపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేయడం వల్ల ముఖం అందంగా కనిపిస్తుంది.


- చర్మం పై నల్ల మచ్చలు బాధిస్తుంటే,వాటిపై కొంచెం నిమ్మ రసాన్ని రుద్దండి. ఇది మీ చర్మం పై ఉన్న నల్ల మచ్చలకు కారణమైన మీ చర్మ రంధ్రాలని శుబ్రం చేసి, మీ చర్మాన్ని మచ్చలు లేకుండా చేస్తుంది.


- కొబ్బరినూనెలో కొంచెం నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రామన్ని ముఖానికి రాసుకొని కొంత స‌మ‌యం త‌ర్వాత‌ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒలా చేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు తొలిగి ముఖం తాజాగా మారుతుంది.


- వెన్న, ఓట్స్ పొడి, నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నున్న‌గా మారుతుంది.


- ఒక‌ స్పూన్ ఆలివ్ ఆయిల్,1 స్పూన్ తేనె, 3 స్పూన్లు నిమ్మ రసం,బాగా కలిపి మీ జుట్టుకి పట్టించండి, 30 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే మంచి మార్పు వస్తుంది.


-  కీరదోస రసంలో కొంచెం నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి. కొంత స‌మ‌యం తర్వాత‌ నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల అలసట తొలిగి ముఖం తాజాగా మారుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: