ముఖంపై మొటిమలు రావటానికి ప్రధానమైన కారణం చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు. మృతకణాలు చర్మాన్ని కాంతిహీనంగా మరియు నల్లగా మారుస్తాయి. మృతకణాలు చర్మంపై పేరుకుపోవడం వలన మేనిఛాయ తగ్గిపోతుంది. ముఖం మెరవాలంటే చర్మంపై ఉన్న మృతకణాలు పోవాలి. ది. అందుకు మార్కెట్‌లో లభించే వివిధ కాస్మోటిక్స్‌ వాడటం వల్ల అందులో ఉపయోగించే రసాయనాలు చర్మంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వాటిని సహజసిద్ధంగా తొలగించడం వల్ల చర్మ సౌందర్యం కాస్త మెరుగుపడుతుంది. 


- అరటి తొక్కలకు చక్కెరను చల్లి శరీరానికి మొత్తం రుద్దాలి. పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే శరీరంపై మృతకణాలు పోతాయి.


- ఉల్లిపాయ రసంలో క్యారెట్‌ రసం, ఆలివ్ ఆయిల్ మ‌రియు ఎగ్ వైట్ వేసి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దానిని ముఖానికి రాసుకుని పావుగంటయ్యాక కడిగేసుకుంటే మృతకణాలు పోతాయి.


- కమలాఫలం తొక్కను ఎండబెట్టి, పొడిచేసి అందులో తగినంత పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మృత‌క‌ణాలు తొలుగుతాయి.


- కొంచెం పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి మృదువుగా ఉంటుంది.


- బ్రౌన్ షుగర్ మరియు కొబ్బరినూనెలను బాగా క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: