ఆడవాళ్లకి జుట్టు అంటే చాలా ఇష్టం అసలు ఇష్టపడని వారు ఉండరు. ఆడవాళ్లే కాదు చిన్న, పెద్దా, మగా, ఆడా అనే భేదం లేకుండా జుట్టు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందులోను నల్లటి జుట్టు అంటే మహా ఇష్టం. కానీ ఈ కాలంలో పని ఒత్తిడి వల్ల, ఆహార పదార్థాల విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్ల, ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది.దీనివల్ల జుట్టు పట్ల శ్రద్ద వహించడం లేదు. దాని వల్ల జుట్టు రాలిపోవడం, పలచబడడం, బట్టతల లాంటి సమస్యలు, జుట్టు మెరవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.


    జుట్టు సమస్యలు ఎక్కువగా ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఇంట్లో పని, పిల్లలు ఉద్యోగం వల్ల సరయిన కేరింగ్ లేకపోడం వల్ల జుట్టు రాలిపోతుంది. అలాగే నెలసరి సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలన్స్ వల్ల కూడా జుట్టు రాలిపోవడానికి ఒక ముఖ్య కారణము. ఆహారం విషయంలో కూడా సరిగ్గా జాగ్రత్త వహించకపోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల సరైన పోషక పదార్థాలు లభించటంలేదు. ఫలితంగా బరువు పెరుగుతున్నారు.బరువు పెరగడం వల్ల శరీరంలో రక్త శాతం తగ్గిపోయి రక్తహీనత వస్తుంది. దీని వల్ల జుట్టు మెరవడం, రాలిపోడమము జరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆలోచన లాంటి వాటిని కూడా దగ్గరకు రానివ్వకూడదు. సాధ్యమైనంతవరకు మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి.


వీలైనంత మటుకు ఆకుకూరలు తినటం, ప్రతిరోజు తలస్నానం చేయటం ఉండాలి.అలా అని నూనె పెట్టకుండా ఉండకూడదు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో నూనె అనేది అసలు పెట్టడం లేదు. అలాకాకుండా రాత్రి అయినా సరే కొంచెం సేపు నూనె పెట్టి, వేళ్లతో మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. జుట్టు ఆరడానికి హెయిర్ డ్రెయెర్ ఉపయోగించకూడదు, జుట్టుని దానంతట అదే గాలికి ఆరేలా ఉంచాలి.

    ముఖ్యంగా జంక్ ఫుడ్డు మానేయాలి పౌష్టిక ఆహారం తినాలి. విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినాలి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. కరివేపాకు జుట్టుకు చాలా మంచిది దానిని తీసి పారేయకుండా అప్పుడప్పుడు తింటుండాలి.మందారం నూనె, అలోవెరా నూనె వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది ముఖ్యంగా ఒత్తిడి, ఆలోచన అనేది తగ్గించుకుని ప్రశాంతంగా ఉంచుకోవాలి.






 

మరింత సమాచారం తెలుసుకోండి: