జుట్టు ఆరోగ్యం, దృఢంగా ఉండాల‌ని ఎవ‌రు కోరుకోరు చెప్పండి.. అంద‌రూ కోరుకునేది అదే. అయితే కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే జుట్టు స‌మ‌స్య‌ల‌కు బేకింగ్ సోడాతో చెక్ పెట్ట‌వ‌చ్చు. బేకింగ్ సోడాను సోడియం బై కార్బోనేట్ అని కూడా పిలుస్తారు. బేకింగ్ సోడాను అందరూ వంటగదిలో ఉపయోగించడం సహజమే, కాని చాల మందికి తెలియని విషయం ఏమిటంటే బేకింగ్ సోడా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కూడ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కొన్నివస్తువుల క్లీనింగ్ ఏజెంట్ నుగాను ఉపయోగిస్తారు. 

 

ముఖ్యంగా దీని వల్ల చర్మానికి , కేశాలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్పూన్ బేకింగ్ సోడా, గుడ్డు పచ్చసొన, ఆలివ్ నూనె మూడు క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి. ఒర అర‌గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం కలిపి నెమ్మ‌దిగా మాడుపై మర్దన చేసుకుని, కొన్ని నిముషాల పాటు వదిలివేయండి. కాసేపు త‌ర్వాత త‌ల‌స్నానం చేసేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌ట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

 

ఆయిల్ హెయిర్ లేదా జిడ్డు వెంట్రుకలను తొలగించడానికి ఒక చెంచా బేకింగ్ సోడాను, మీరు వేసుకొనే రెగ్యులర్ షాంపు బాటిల్ లో వేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా మీ కేశాల మీదు చిలకరించుకోవడం వల్ల మంచి మెరుపును అందిస్తుంది. అంతే కాదు మీ కేశాల్లో ఉండే క్లోరిన్ తొలగించడానికి బేకింగ్ సోడా బాగా సహాయపడుతుంది. కాగా, బేకింగ్ సోడాను కేశసంరక్షణ ఉత్పత్తుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని యాంటీసెప్టిక్ లక్షణాలు జుట్టు స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: