ఏంటి ? ఉడికించిన నీటితో అందమా? అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఉడికించిన నీటితో అందాన్ని పెంచుకోండి. కూరగాయలూ, ఆకుకూరలూ, బియ్యం, పప్పులూ ఇలా ప్రతి రోజు తినే వాటిని ఉడికిస్తూ ఉంటాం. అలాంటి వాటి నీళ్ళే ఎంతో అందాన్ని ఇస్తాయి. అది ఎలాగంటే?

 

బంగాళదుంపలు ఉడికించిన నీటిలో కొద్దిగా ముల్తానీ మట్టీ, పెరుగూ, మూడు చుక్కలు బాదం నూనె కలిపి ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకోవాలి. అంతే దీనివల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలూ, జిడ్డు తొలగిపోయి ఎంతో అందాన్ని ఇస్తాయి.. తాజాగా మెరిసిపోతుంది. 

 

ఎండ కాలం వచ్చింది కాబట్టి.. ఎంత కాదు అనుకున్న బయటకు వెళ్లిన సమయంలో ఎండలో చర్మం అలసిపోతుంది. అలాంటి చర్మానికి గంజి నీళ్లను వాడితే చర్మం తాజాగా ఉంటుంది. గంజి నీళ్లలో కొంచెం తేనె కలిపి ముఖానికి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఆతర్వాత గంజి నీళ్లలో కాస్త బియ్యంపిండి కలిపి వారానికి రెండు సార్లు ఈ పూత పూసుకుంటే నలుపు సమస్య తగ్గి ముఖం అందంగా తయారవుతుంది. 

 

క్యాబేజీని ముందుగా నీళ్లలో ఉడికించి కొన్ని నీళ్లలో కొంచె పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా తయారవుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ చర్మాన్ని తాజాగా రెడీ చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: