అందంగా ఉండాలి అని.. అందమైన వారిలా కనిపించాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలామందికి సాధ్యం అవ్వదు. ఎందుకంటే వారు సరైన బ్యూటీ టిప్స్ పాటించారు.. అంతేకాదు.. బయట కెమికల్స్ ఉన్న క్రీములు వాడటం వల్ల కొందరికి రియాక్షన్స్ కూడా అవుతాయి. అలాంటి వారు అంత కూడా ఈ చిట్కాలు ఎలా పాటించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పొడిబారిన చేతులకు 2, 3 నిమిషాల పాటు ఏదైనా వంట నూనెతో కానీ కొబ్బరినూనెతో కానీ చేతి వేళ్లపై మృదువుగా మర్దన చేసుకోవాలి.   

 

కాస్త మీగడ తీసుకుని చేతులకు రాసి రుద్దితే చేతులు మృదువుగా మరి అందంగా మెరిసిపోతాయి. 

 

నిమ్మరసం ఓ గిన్నెలోని నీళ్లలో కలిపి ఆ చేతులను పది నిమిషాల పాటు మునిగేలా పెట్టుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల పొడిగా నిర్జీవంగా మరీనా చేతులు ఆరోగ్యంగా మృదువుగా మెరిసిపోతాయి..  

 

చెంచా గులాబీ నీటిలో కొన్ని చుక్కల గ్లిజరిన్‌ కలిపి చేతులకు రుద్దాలి ఇలా చెయ్యడం వల్ల చేతి వేళ్ళు మృదువుగా అందంగా మారుతాయి. 

 

ఈ చిట్కాలను పాటిస్తే మీ చర్మం అందంగా.. ఆరోగ్యంగా తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాలు పాటించేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: