సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఫేస్‌లో ఎలాంటి లుక్ త‌గ్గ‌కుండా క‌నిపించాల‌ని కోరుకుంటారు. అయితే వాటీజ్ బ్యూటి అంటే.. వైటీజ్ బ్యూటి అనే ప‌రిస్థితి మ‌న‌ది. అవును! డార్క్ స్కిన్ వాళ్ల‌ను ఎందుకో తెలియ‌దుగాని చిన్న చూపు చూస్తారు చాలా మంది. కాని వాళ్ల‌కు తెలియ‌నిది ఏంటంటే.. మంచి మనసు లేకపోతే కనిపించే పై అందం కూడా వ్యర్థమే. తెల్లటి చర్మ రంగు కంటే గొప్ప మ‌న‌స్సు మనకు అందాన్నిస్తుంది. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ఎన్ని చెప్పినా చాలా మంది డార్క్ స్కిన్‌తో బాధ‌ప‌డుతుంటారు. 

 

అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయితే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు. అందులో ముందుగా స్కిన్ టోన్ మార్చడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, రెండు స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ పెరుగు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ లక్షణాలు డార్క్ స్కిన్ త‌గ్గిస్తుంది. అలాగే గంద మరియు రోజ్ వాటర్ క‌లిపి పెట్టుకోవాలి.

 

ఇప్పుడు ఈ ప్యాక్‌ను ఫేస్‌కు అప్లై చేయాలి. పావు గంట త‌ర్వాత గోరువెచ్చిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం కూడా డార్క్ స్పిన్ స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌రియు చర్మాన్ని వైట్ గా మార్చుకోవడం కోసం పసుపును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఫేస్ ప్యాక్ లో పిగ్మేంటేషన్ నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి . కాబ‌ట్టి పసుపులో కొద్దిగా పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేసి.. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. పావుగంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: