సాధార‌ణంగా మ‌న అందాన్ని రెట్టింపు చేసి చూపించేవాటిలో జుట్టు కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. శిరోజాలు ఎంత న‌ల్ల‌గా.. ఎంత ఒత్తుగా ఉంటే మ‌న అందం కూడా అంత రెట్టింపుగా క‌నిపిస్తుంది. కానీ నేటి కాలంలో అతి త‌క్కువ వ‌య‌స్సులోనే తెల్ల‌జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. సీనియర్ సిటిజన్ అయ్యాక నెరవాల్సిన జుట్టు 30 ఏళ్లకే తెల్లబడిపోతోంది. ఇక తెల్ల జుట్టు నుంచి విముక్తిని పొందేందుకు హెన్నాలని, హెయిర్ కలర్‌లని, ట్రీట్‌ మెంట్స్ అని వేలకు వేలు తగలేస్తున్నారు. కానీ, ఇవేమీ లేకుండా ఇంట్లో దీన్ని శాశ్వ‌తంగా నివారించవ‌చ్చిన చాలా మందికి తెలియ‌డం లేదు. 

 

మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్త‌వానికి చాలా మంది నెలకో షాంపూ మారుస్తుంటారు.. మార్కెట్‌లో ఏది కొత్తగా వచ్చినా దాన్ని ట్రై చేయాలని ఉత్సాహపడుతుంటారు. అలా కాకుండా దీర్ఘకాలంలో ఒకే రకమైన షాంపూను వాడటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే  గోరింటాకు ఆకుల్ని మెత్తగా నూరి అందులో మూడు టీస్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీస్పూన్‌ కాఫీ పౌడర్‌, కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిపోయాక త‌ల‌స్నానం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

 

అదేవిధంగా, ఆకు కూరల్లో ఐరన్, కాల్షియమ్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు నేచురల్ రంగు మారిపోకుండా ఉంటుంది. ఇక కరివేపాకు కొబ్బరినూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి తలకు రాయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల‌ వెంట్రుకలను నివారిస్తుంది. మ‌రియు అందరి ఇంట్లో లభించే మందార ఆకులను తీసుకుని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకుని కొబ్బరి నూనె కలిపి ప్యాక్‌లా చేసుకుని దానిని జుట్టుకి పట్టించాలి.. తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


 
  

మరింత సమాచారం తెలుసుకోండి: