సాధార‌ణంగా కళ్లు అందంగా కనిపించాలంటే.. ఐ బ్రోస్‌ కూడా అంతే అందంగా కనిపించాలి. ఈ క్ర‌మంలోనే అంద‌రూ ఐబ్రో త్రెడింగ్ చేయించుకుంటారు. ఈ ఐబ్రో త్రెడింగ్ వల్ల‌ కనుబొమ్మలు చక్కని షేప్ ని సంతరించుకుంటాయి. దీంతో మేక‌ప్ లేకున్నా అందంగా క‌నిపించ‌వ‌చ్చు. అందుకే ఈ బ్యూటీ ప్రాసెస్ ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలకొద్దీ మహిళలు తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకున్నారు. అయితే  ఐ బ్రోస్ ను మంచి ఆకారంలో తీర్చి దిద్దడానికి త్రెడింగ్ సులభ పద్దతే.

 

కానీ, దీని వల్ల కొంతమందికి త్రెడింగ్ తర్వాత కనుబొమ్మల వద్ద దద్దుర్లు లేదా వాపు లేదా ఎర్రగా మంటపుట్టడం లేదా విప‌రీత‌మైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి టైమ్‌లో భ‌య‌ప‌డ‌కుండా చిన్న చిన్న టిప్స్‌ను ఫాలో అయితే ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఐబ్రోత్రెడింగ్ చేసేట‌ప్పుడు కనుబొమ్మలపై హెయిర్ ను తొలగించడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఈ రంధ్రాలను తిరిగి మూసివేయడానికి ఐస్ క్యూబ్స్ సహాయపడుతాయి.

 

కాబ‌ట్టి.. త్రెడింగ్ ఫినిష్ అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయడం వల్ల నొప్పి, వాపు వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. అలాగే త్రెడింగ్ తర్వాత‌ ఎరుపు, వాపు తగ్గించడానికి ప్రభావిత ప్రాంతం ఫై టీ బ్యాగ్ అప్లై చేయండ వ‌ల్ల త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. మ‌రియు పాలలో ఉండే ప్రోటీన్లు త్రెడింగ్ వల్ల ఏర్పడే మంట, వాపును తగ్గిస్తాయి. అందుకే త్రెడింగ్ త‌ర్వాత ప్ర‌భావిత ప్రాంతంలో పాల‌ను అప్లై చేస్తే మంచి ఫ‌లితాల‌ను పొందొచ్చు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: