మూల్లాని మిట్టి.. ఆడ‌వారికి పెద్దగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆడ‌వారు ఏవైనా ఫంక్ష‌న్స్ వ‌చ్చాయంటే చాలు.. త‌మ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు దీన్ని ఉప‌యోగిస్తూనే ఉంటారు. అయితే ఈ ముల్తానీ మట్టిని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న బ్యూటీ ప్రోడెక్ట్‌ కాదు. నిజానికి దీన్ని రోమన్ కాలం నుండి ఒక అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్ గా మ‌రియు ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తున్నారు. ఇక ముల్తానీ మిట్టి గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుంటే.. దీన్ని మ‌రిన్న ప్ర‌యోజ‌నాల‌కు యూజ్ చేసుకోవ‌చ్చు.

 

ముల్లానీ చర్మంలో మలినాలనుతొలగించడానికి మాత్రమే కాదు, ఇతర చర్మ సమస్యలు, మొటిమలు, మచ్చలు, ముఖంగా ప్యాచ్ లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ముల్తానీ మట్టిలో అధికంగా మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. మెగ్నీషియం క్లోరైడ్ చర్మం రంధ్రాల్లోని మొత్తం బ్యాక్టీరియాను, దుమ్ము, ధూళిని తొలగించి మంచి క్లెన్సర్ గా సహాయపడుతుంది. అలాగే ముల్తాని మిట్టి దెబ్బతిన్న జుట్టుకు కండిషనింగ్ మరియు రిపేరింగ్ ఏజెంట్‌గా బాగా పనిచేస్తుంది. 

 

ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకొని ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల జిడ్డు చ‌ర్మం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అదేవిధంగా,  ముఖం మీద బ్లాక్‌హెడ్స్‌, ప‌గుళ్లు అందాన్ని తగ్గిస్తాయి. ఇవి తగ్గాలంటే టేబుల్‌ స్పూన్‌ ముల్తానీ మట్టిలో బేకింగ్‌ సోడా, చార్‌కోల్‌, కొద్దిగా రోజ్‌వాటర్‌ లేదా మినరల్‌ వాటర్‌ వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి పావుగంట త‌ర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. కాబ‌ట్టి, కేవ‌లం పెళ్లిళ్లు ఇత‌రిత‌ర ఫంక్ష‌న్స్ మాత్ర‌మే కాకుండా.. వారానికి ఒక‌సారి ముల్లానీ మిట్టిని ఉప‌యోగిస్తే మంచిదంటున్న‌రా సౌంద‌ర్య నిపుణులు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: