పూర్వం రెండు రోజులకి ఒక సారైనా మహిళలు నలుగు పెట్టుకుని స్నానం చేసేవారు. మగపిల్లకి కూడా నలుగు పెట్టడం అలవాటే కేవలం మహిళలు మాత్రమే నలుగు పెట్టుకోవాలనే రూల్ ఏమి లేదు. ముఖం ఎంతో వచ్చస్సు కలిగి ఉండాలంటే తప్పకుండా నలుగు పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు వాడే ఫేస్ మాస్క్, జెల్ లు ఇవన్నీ రాసాయానికి మిళితాలే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్ లేని రసాయనాలు లేని ఈ పురాతన పద్దతిని పాటించడం ఎంతో మంచిది..మరి ఈ నలుగు ఎలా పెట్టుకోవాలి..ఇందులో ఏమి కలపాలి అనే విషయాలు తెలుసుకుందాం..

IHG

ఆయుర్వేద సౌందర్య సాధనాలలో నలుగు పిండికి ప్రత్యేకమైన స్థానం కలిపించారు నిపుణులు. ఎందుకంటే ఇప్పుడైతే సబ్బులు, ఫేస్ మాస్క్ లు వచ్చాయి..మరి పూర్వం ఇలాంటివి లేవు కాబట్టి చర్మ సౌందర్యం కోసం ఈ పద్దతిని కనిపెట్టారు. కొన్ని రకాల పప్పు ధాన్యాలని కలిపి మెత్తని పొడిగా చేసి నలుగు పిండిగా మార్చేవారు. ఇది అన్ని రకాల చర్మాల వారికి ఎంతో అద్భతంగా పనిచేస్తుంది..

IHG

సహజంగా నలుగు పిండిలో వివిధ రకాల పప్పులని పిండి చేసి కలిపి వాడుతారు. శనగపిండి ,ఆవ పిండి, ఉలవ పిండి,పసుపు మంచి గంధం,మారేడు పొడి బియ్యపు పిండి, పాలు ఇలా అన్నిటిని కలిపి శరీరానికి పట్టిస్తారు కొందరు. మరికొందరు శనగపిండి లో పసుపు , పాలు మాత్రమే వేసి తయారు చేస్తున్నారు ఇలా తయారుచేసిన నలుగు పిండిని చర్మానికి పట్టించి బాగా రుద్దాలి. ఇలా చేయడం వలన అసహజంగా  చర్మంపై వచ్చే మార్పులు పోతాయి..చర్మం నునుపుగా మారుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది..ముఖం ఎంతో వచ్చస్సుతో కళకళలాడిపోతూ ఉంటుంది..ప్రస్తుతం అందరూ ఇళ్ళ వద్దే సమయం గడుపుతున్నారు కాబట్టి ఎప్పుడో వంటికి పెట్టుకున్న నలుగు మరొకసారి చేసి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: