అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉండాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. అందుకోసం ఏవేవో ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి.. బ్యూటీ పార్ల‌ర్స్ చూట్టూ తిరుగుంటారు. కానీ, శాశ్వ‌త ఫ‌లితం లేక నిరాశ‌కు గుర‌వుతుంటారు. అయితే వాస్త‌వానికి మ‌నం చేసే కొన్ని త‌ప్పుల వ‌ల్లే చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ త‌ప్పులు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా చర్మాన్ని శుభ్ర పరచడం అనేది చాలా మంచి విష‌య‌మే. దీనిని అంద‌రూ పాటిస్తారు కూడా. 

 

అలా అని అతిగా శుభ్రపరచడం వల్ల చర్మానికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరిగే అవకాశం ఉంది. ఇలా అతిగా క్లీన్‌ చేయడంవల్ల చర్మంలో సహజంగా ఉండే ఆయిల్స్‌ను తీసివేసి.. మీ చర్మానికి మరింత ఎక్కువగా హాని కలిగిస్తుంది. కాబ‌ట్టి, చ‌ర్మాన్ని అతిగా మాత్రం క్లీన్ చేయ‌కండి. అలాగే మొటిమలను  పిండడం అనేది ఒక సులభమైన పరిష్కార మార్గంలా కనిపించినప్పటికీ, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. అంతేకాకుండా.. అవాంఛనీయమైన మొండి మచ్చలు కలగటానికి కార‌ణ‌మ‌వుతుంది. చర్మ సంరక్షణలో మొటిమలను చింపడం అనేది ఒక భాగంగా ఉన్నా.. అలా చెయ్యడం అస్స‌ల మంచిది కాదు. 

 

అదేవిధంగా, చర్మాన్ని స్క్రబ్బింగ్ చేయటం వల్ల‌.. చర్మంపై పేరుకున్న వ్యర్ధాన్ని తొలగించి పరిశుభ్రంగా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇది ఒక మంచి అల‌వాటు. అయితే చాలా మంది స్క్ర‌బ్బింగ్ చేసుకోవ‌డానికి బ‌ద్ద‌కిస్తారు. ఇలా స్క్రబ్బింగ్ చెయ్యకపోవటం వల్ల.. చ‌ర్మం సహజ సౌందర్యాన్ని కోల్పోయి, ఎర్ర బడటం, పగుళ్ళకు గురవటం వంటివి ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి, వారానికి రెండు సార్లు అయినా స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి. మ‌రియు కఠినమైన రసాయనాలతో తయారుచేయబడిన సౌందర్య సాధనాలు యూజ్ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దారి తీస్తుంది. కాబ‌ట్టి, వాటికి దూరంగా ఉండండి.

 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: