బంగాళ‌దుంపలు.. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప‌ల‌ను పిలుస్తుంటారు. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని మరికొన్ని ప్రాంతములలో బంగాళదుంప లేదా బంగాల్ దుంప అని పిలుస్తారు. పేరు ఏదైనా రుచి మాత్రం ఒక‌టే. ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న ఈ బంగాళదుంపతో చేసే రుచికరమైన వంటలను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఈ ఆలుగడ్డలు కేవ‌లం వంట‌ల‌కు, ఆరోగ్యానికి మాత్ర‌మే కాకుండా.. అందాన్ని మెరిపించుకోవ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 

అందుకు ముందుగా, బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం మిక్స్ చేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ముఖం తెల్ల‌గా మారుతుంది. వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే బంగాళాదుంప రసం, తేనెని తీసుకొని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు త‌గ్గంతో పాటు కాంతివంతంగా మారుతుంది.

 

ఇక ఇటీవ‌ల చాలా మందికి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారు  బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి. అదేవిధంగా, బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న మురికిని తొలిగిస్తుంది. మ‌రియు చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా, అందంగా మారుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: