జుట్టు.. ఏ మనిషి అయినా అందంగా కనిపించాలి అంటే జుట్టు అందంగా ఉండాలి. అప్పుడే అందంగా కనిపిస్తారు. అయితే జుట్టు ఆరోగ్యంగా, అందంగా, సహజంగా ఉండాలి అంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు పాటించాలి. ఇంకా ఈ నూనెలు వాడితే జుట్టు అద్భుతంగా తయారవుతుంది. అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

ఆముదం.. దీంతో జుట్టుకు మర్దన చెయ్యటం వల్ల జుట్టు రాలటం తగ్గి నల్లగా వత్తుగా జుట్టు పెరుగుతుంది. ఈ ఆముదంలో ఆవనూనె కలిపి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

 

సహజ నూనెలో అవకాడో నూనె ప్రత్యేకం. ఇది జుట్టు ఎదుగుదలకు ఎంతో సాయం చేస్తుంది. అవసరమయ్యే పోషకాలతో పాటు జుట్టుకు కావాల్సిన విటమిన్‌ ఎ, బి, డి, ఇ అవకాడో నూనె అందిస్తుంది. 

 

జుట్టు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఉసిరినూనె ఉపయోగించాలి. ఇందులో విటమిన్ సి నేరుగా జుట్టుకు అందుతుంది. రాత్రి నిద్రకుముందు ఉసిరి నూనె తలకు పట్టించుకుని.. మర్దన చేసుకుంటే అలసట తగ్గి చుండ్రు, జుట్టు రాలడం, తలా నొప్పి వంటి సమస్యలు ఉండవు. 

 

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆలివ్ ఆయిల్ జుట్టుకు ఎంతో సహాయం చేస్తుంది. ఇది కూడా జుట్టు రాలకుండా, చుండ్రు చేరకుండా చూస్తుంది. 

 

రోజ్‌మేరీ ఆయిల్‌ ఉపయోగిస్తే జుట్టు చిక్కగా, పొడవుగా మారుతుంది. పోషకాల లోపంతో జుట్టు ఎదుగుదల తక్కువగా ఉన్నవారికీ ఇది మంచి ఫలితాన్ని అందిస్తుంది.

 

జుట్టు పలచగా ఉన్నవారు వారానికి 2 సార్లు స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ ఉపయోగిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

 

చూశారుగా.. ఈ నూనెలు ఉపయోగించి మీ జుట్టును అందంగా, ఆరోగ్యంగా తయారుచేసుకోండి.                              

మరింత సమాచారం తెలుసుకోండి: