పొడి చర్మం.. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరికి మాత్రం సీజన్‌తో పని లేకుండా.. ఎప్పుడూ పొడి చర్మం వేధిస్తూనే ఉంటుంది. దీని వల్ల చర్మంలో దురద, మంట, కొన్ని సందర్బాల్లో వాపుకు కూడా కారణం అవుతుంది. ఎన్ని చిట్కాలు పాటించినా, ఎన్ని క్రీములు వాడిన ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఎఫెక్టివ్ టిప్స్ పాటిస్తే.. ఖచ్చితంగా పొడి చర్మానికి చెక్ పెట్టవచ్చు. మరి లేట్ చేయకుండా అవేంటో చూసేయండి..
ఒక బౌల్‌లో పచ్చిపాలు తీసుకుని.. అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖానికి అద్దాలి. పావు గంట పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. అదే సమయంలో చర్మానికి మంచి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. తద్వారా ముఖం సున్నితంగా మారుతుంది. అలాగే బాగా పండిన అరటి పండు తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి.. పావు గంట పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల పొడి చర్మానికి చెక్ పెట్టవచ్చు.
బొప్పాయి పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. పావు గంట పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల చర్మానికి తగినంత పోషణ అందుతుంది. అదేవిధంగా, ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇక కలబంద గుజ్జులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. పావు గంట పాటు ఆరనిచ్చి.. అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల కూడా పోడి చర్మాన్ని నివారించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి