పెరుగు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

పెరుగులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ లోని తేమను నిలిపి ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. చర్మానికి హెల్తీ అలాగే యూత్ ఫుల్ లుక్ ను అందిస్తాయి. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ప్రాబ్లెమ్ ను అరికడతాయి. ముడతలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ ను తగ్గిస్తాయి. పెరుగులో విటమిన్ సి అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ డేమేజ్ పై పోరాడుతుంది. ఆ విధంగా, స్కిన్ ను హానికర అల్ట్రా వయొలెట్ రేస్ నుంచి రక్షిస్తుంది.
యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేవి పెరుగులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి స్కిన్ ను జెర్మ్స్, బాక్టీరియా అలాగే ఫంగై నుంచి రక్షిస్తాయి. ఫలితంగా, యాక్నే, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యల రిస్క్ తక్కువగానే ఉంటుంది.

పెరుగు ఎసిడిక్ నేచర్ కలిగినది. అలాగే జింక్ ఇందులో పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. చర్మంపై ఉండే మచ్చలు, మార్క్స్, సన్ ట్యాన్ మరియు పిగ్మెంటేషన్ వంటివాటిని ప్రభావవంతంగా తగ్గిస్తుంది.


రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, మ్యాష్ చేసిన అరటిపండు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ ను తీసుకోండి. ఇప్పుడు, ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం అలాగే మెడపై అప్లై చేయండి. ఇలా ప్రతి రోజూ చేయండి. ఎందుకంటే, రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ ను ఫాలో ఐతే ముఖమనేది నేచురల్ గా గ్లో అవుతుంది.

రెండు టేబుల్ స్పూన్స్ తాజా పెరుగు మరియు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకుని ఈ రెండిటినీ బాగా కలిపి ముఖానికి సున్నితంగా ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకుంటే ముడతలు రావు. ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖంపై కనీసం గంటపాటు ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఒక టీస్పూన్ శనగపిండి తీసుకోండి. అందులో రెండు టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్ ను కలపండి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలపండి. వీటిని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోండి. పదిహేను నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకోండి.

పెరుగులో సహజసిద్ధమైన ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ లభిస్తుంది. దీన్నే లాక్టిక్ యాసిడ్ అనంటారు. ఇది నేచురల్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. స్కిన్ పై పేరుకుని ఉన్న డెడ్ సెల్స్ లేయర్స్ ను సులభంగా తొలగిస్తుంది. స్కిన్ కు ఫ్రెష్ ఫీల్ అందిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: