ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మందికి చిన్న తనం నుంచే జుట్టు తెల్ల బడుతుంది.. కొంతమందికి జన్యు పరంగా తెల్లబడుతుంది. మరి కొంత మందికి మాత్రం విటమిన్ బీ12, విటమిన్ డీ, కాపర్, ఐరన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఒత్తిడి వల్ల కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. సూర్య రష్మికి ఎక్కువ గా గురవ్వడం కూడా ఒక కారణమే. అయితే దీనికి పరిష్కారం ఎక్కడో లేదండి. మన వంటింట్లోనే వుంది.. తెల్లని జుట్టు నల్లగా నిగ నిగ లాడిపోవడానికి కరివేపాకు మాస్కని తయారు చేసుకోండి...ఈ మాస్క్ జుట్టు కుదుళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ని అందిస్తుంది. అందు వల్ల జుట్టు తెల్లబడడం ఆగిపోతుంది, తరవాత వచ్చే జుట్టు ఆరోగ్యకరం గా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ రెగ్యులర్ గా వేసుకోండి, రెండు మూడు నెలల్లో మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది.
కరివేపాకు మాస్క్ వేసుకోడానికి మీకు కావాల్సిన పదార్ధాలు...రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, పది పన్నెండు కరివేపాకులు....
కరివేపాకు మాస్క్ చేసుకునే పద్ధతి....ముందుగా ఏం చెయ్యాలంటే కొబ్బరి నూనెని వెచ్చబెట్టండి.గోరు వెచ్చ కంటే ఇంకొంచెం వేడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యండి.కరివేపాకులు నూనెలో వెయ్యండి.ఇరవై నిమిషాల పాటూ వదిలెయ్యండి.వేడి కొబ్బరి నూనె లోకి కరివేపాకు లో ఉన్న పోషకాలనీ వెళ్తాయి.ఇరవై నిమిషాల తరువాత కొబ్బరి నూనె చల్లారి ఉంటుంది కానీ, కొద్దిగా వెచ్చగా ఉంటుంది.ఇప్పుడు ఈ నూనెని జుట్టు కుదుళ్ళ నించీ కొన వరకూ, స్కాల్ప్ అంతా పట్టించండి.బాగా మసాజ్ చెయ్యండి.కనీసం రెండు గంటలు అలా ఉంచండి. రాత్రంతా వదిలేసిన పరవాలేదు.
మైల్డ్ షాంపూ తో తల స్నానం చెయ్యండి.కండిషనర్ వాడడం మర్చిపోవద్దు.చివర్లో నాలుగు చుక్కల విటమిన్ ఈ ఆయిల్ కూడా నీటిలో కలుపుకోవచ్చు. దీని వల్ల జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది.ఇలా ప్రతి వారం చేసి చూడండి.కచ్చితంగా మీ జుట్టు నల్లగా మారి అద్భుతమైన ఫలితం వస్తుంది..ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి