పూర్వకాలంలో ఆడవాళ్ళు కేవలం ముఖం పైనే  శ్రద్ధ వహించేవారు. కానీ ప్రస్తుతకాలంలో మాత్రం అలా కాదు. ఆడవాళ్లకు అందం అంటేనే ముఖం నుంచి కాళ్ల వరకు అన్నీ  అందంగా కనిపించాలని అనుకుంటారు. ముఖానికి ఫేషియల్స్ ఎలా చేయిస్తారో? ఇక కాళ్ళకు కూడా పెడిక్యూర్ అలాగే చేయిస్తారు. కాళ్ళకు పెడిక్యూర్ చేయించాలి అంటే మాత్రం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పార్లర్ కి వెళితే తప్ప పెడిక్యూర్ చేయించుకోలేము. అలాంటిది ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే, ఎలాంటి పార్లర్ కు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే కూర్చొని, తక్కువ ఖర్చుతో పెడిక్యూర్ మీ అంతట మీరే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే పార్లర్లో  చేసే పెడిక్యూర్ కన్నా మీరు సొంతంగా చేసుకోవడం వల్ల మీ పాదాలు మరింత అందంగా మారుతాయి అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ముందుగా మీ పాదాల వేళ్ల గోర్లకు నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ రిమోవర్ ని  ఉపయోగించి తీసివేయండి. ఆ తర్వాత ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, అందులో ఐదు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు ఉప్పు, సుగంధ నూనె,తేలికపాటి షాంపూ వేసి అన్నీ కలిపి, అందులో 30 నిమిషాల పాటు పాదాలను పెట్టి కూర్చోవాలి. పాదాలు బాగా నానిన తరువాత ఫ్యూమిస్ స్టోన్  లేదా బాగా పట్టించిన సున్నిపిండితో పాదాలను రుద్ది శుభ్రం చేయాలి.


తర్వాత గోళ్ళను నీట్ గా కట్ చేసుకుని,  ఏదైనా మట్టి ఉంటే శుభ్రం చేసుకోవాలి. ఏదైనా నూనె లేదా క్రీమ్ తో  గోళ్లను,పాదాలను మర్దనా చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఆ తరువాత మాయిశ్చరైజర్ తీసుకుని పాదాలకు పట్టించి, సుతిమెత్తగా వృత్తాకారంలో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సుతిమెత్తగా అందంగా తయారవుతాయి. అంతేకాకుండా చాలామందికి  మెడిమల పగుళ్ళతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు నిమ్మచెక్కతో రాత్రి పడుకునే ముందు పగుళ్లపై రుద్దడం వల్ల త్వరగా మెడిమల పగుళ్ళు మాని, అందంగా తయారవుతాయి.

మీకు సాధ్యమైనంత వరకు ఓపిక తెచ్చుకొని,ఈ పద్ధతిని పాటించడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా, పార్లర్ల  చుట్టూ తిరగకుండా కేవలం ఇంట్లో ఉండే పెడిక్యూర్ ని మీరే సొంతంగా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: