ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు వచ్చి, అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా తెల్లజుట్టును కప్పిపుచ్చుకోవడానికి మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ తీసుకొచ్చి, జుట్టుకు వేస్తున్నారు. అయితే ఇవి సత్వర ఫలితాన్ని ఇచ్చినా,శాశ్వతంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వవు. ఫలితంగా దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆ ఆకుల రసాన్ని, ఒక సారి పట్టిస్తే చాలు, జీవితంలో తెల్లజుట్టు రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆకులు ఏంటో?ఇప్పుడు చూద్దాం..
బిళ్ళ గన్నేరు ఆకులు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనినే కొన్ని ప్రాంతాలలో వినాయకుడు పూలు అని కూడా అంటారు. అయితే ఈ బిల్లగన్నేరు ఆకులను తీసుకొని, బాగా రుబ్బి రసం చేసుకోవాలి. ఆకుల రసాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకొని, అందులో అర చెక్క నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఇక అంతేమోతాదులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి మూడింటిని ఒక బౌల్లో వేసి, బాగా మిక్స్ చేయాలి.
ఇక జుట్టును పాయలు పాయలుగా తీసుకుని, కుదుళ్ళకు బాగా ఈ మిశ్రమాన్ని పట్టించాలి. ఒక గంట ఆరిన తరువాత గాఢత తక్కువగా కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి.
బిళ్ళగన్నేరులో గల కారణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చేడమే కాకుండా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రాలిపోయే జుట్టు కుదుళ్ల నుంచి ఒత్తుగా పెరగడానికి ఈ రసం ఎంతగానో సహాయపడుతుంది.
ఇక నిమ్మకాయ మన జుట్టుకు ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇవ్వడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా చుండ్రు నివారణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది
ఇక కొబ్బరి నూనె కుదుళ్ళను బలపరిచి జుట్టుకు కావలసిన పోషకాలను అందించటమే కాకుండా జుట్టు నిగారింపుతో పాటు జుట్టు పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది.కాబట్టి ఈ చిట్కా మీరూ పాటించండి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి