ఏ నీటితో కడుగుతాం..? మంచి నీటితోనే ముఖాన్ని కడుగుతాం..? అని అనుకుంటున్నారు కదా..! అవునండీ ..!  ప్రతి ఒక్కరూ మంచి నీటితో నే ముఖాన్ని కడుగుతారు.. కానీ ఆ మంచి నీటితో కూడా కడిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి.. అలా చేస్తే ముఖం అందంగా మారుతుంది. అయితే ఆ జాగ్రత్తలేంటో, ఏ పద్ధతిలో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలో..? ఇప్పుడు తెలుసుకుందాం..


ఫేస్ మసాజ్:
ఫేస్ ని మసాజ్ చేయడం వల్ల కొలాజెన్ స్టిములేట్ అవుతుంది. ఫలితంగా మీరు వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే మీ ఫేషియల్ మజిల్స్ స్ట్రాంగ్ అయ్యి,రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.  అంతే కాకుండా ముఖం అందంగా కనిపిస్తుంది.

చల్లని నీరు:
చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల మీ స్కిన్ రిఫ్రెష్ అవుతుంది. ముడతలు తగ్గి స్కిన్ టైట్ గా మారుతుంది. అలాగే స్నానం గోరువెచ్చని నీటితో చేసినా, ముఖాన్ని మాత్రం చల్లని నీటితో కడుక్కోవడం మంచిది. వేడి నీళ్ల వల్ల స్కిన్ బలహీనపడి, హైడ్రేటెడ్ గా అవుతుంది . కాబట్టి చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడానికి ప్రయత్నించండి.

మృదువైన సోపు వాడడం :
సోపులను ఎంచుకోవడంలో కూడా ఒక ఆర్ట్ ఉంటుంది. సోపులను ఎంచుకునేటప్పుడు తక్కువ క్షీర స్వభావం కలిగిన సబ్బులను మాత్రమే ఎంచుకోవాలి.  ఈ హార్ష్ సబ్బులను వాడటం వల్ల మీ ఫేస్ మీద ఉన్న నేచురల్ ఆయిల్ ని తీసేస్తాయి. అంతేకాకుండా యాక్నె సమస్యతో బాధపడుతున్నవారు వీటికి దూరంగా ఉండాలి. అందుకే జెంటిల్ సోప్స్ ను మాత్రమే వాడాలి.


మేకప్ ఫ్రీ :
వర్క్ ఫ్రం హోం పేరిట చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి అలాంటి సమయాల్లో మేకప్ అవసరం లేదు. ఒకవేళ మీకు మేకప్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మరీ మంచిది.. కాబట్టి వీలైనంత వరకు మేకప్ ను తగ్గించడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా అవసరమైతే తప్ప మేకప్ ను  వేసుకోకూడదు.


 చేతులు శుభ్రంగా కడుక్కోవడం :
ఎక్కువమంది లాప్ టాప్ పైన సెల్ ఫోన్ ల పైన వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకు తెలియకుండానే వాటి కీ బోర్డ్స్ పై చాలా బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి ముఖం కడుక్కునేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: