అందం పైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ, ఈ అవాంచిత రోమాలను తొలగించే పద్ధతి తప్పకుండా తెలిసి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా థ్రెడ్డింగ్,వ్యాక్సింగ్ అని రెండు రకాలు ఉన్నాయి. థ్రెడ్డింగ్ కారణంగా నొప్పి పుడుతుంది కాబట్టి చాలామంది వ్యాక్సింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యాక్సింగ్ చర్మాన్ని నునుపుగా,అందంగా మారుస్తుంది . అయితే అందరూ పాటించే ఈ వ్యాక్సింగ్ వల్ల కొన్ని ప్రమాదాలు కూడా వున్నాయి .. అయితే అవేంటో మనం కూడా తెలుసుకుందాం..


వ్యాక్సింగ్ వెంట్రుకలను నేరుగా లోపలి పొరల నుండి తొలగిస్తుంది. ఒకసారి వ్యాక్సింగ్ చేస్తే, షేవింగ్ చేసిన దాని కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితం ఉంటుంది. వ్యాక్సింగ్ చర్మాన్ని ఎక్స్ పోలియేట్  చేస్తుంది కాబట్టి చర్మం సున్నితంగా, నునుపుగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ వ్యాక్సింగ్ చేయడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. ఇందుకు కారణం వేడిగా ఉన్న మైనపు మిశ్రమాన్ని చర్మంపై పూయడం వల్ల   చర్మం ఎర్రగా మారి,దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.


అయితే వ్యాక్సింగ్ తరువాత కనిపించే మరొక సమస్య మంట. ఆ మైనపు మిశ్రమాన్ని పట్టించి, అవాంఛిత రోమాలను ఒక్కసారిగా గట్టిగా లాగడం వల్ల ఆ ప్రదేశంలో మంట,నొప్పి కలుగుతుంది.  అంతేకాకుండా  చర్మం  కూడా వాపుకు గురి అవుతుంది.  అంతేకాకుండా వ్యాక్సింగ్ ప్రక్రియలో ఉపయోగించే ఉత్పత్తులు అపరిశుభ్రంగా ఉన్నా లేదా బ్యాక్టీరియా వంటివి సంక్రమించినవి వాడడం లేదా ఒకరికి ఉపయోగించిన ఉత్పత్తులను మరొకరికి ఉపయోగించడం ఇలాంటివి చేయడం వల్ల అంటు వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా ఉన్నాయి.


అంతేకాకుండా వ్యాక్సింగ్ అనుభవమున్న నిపుణుల దగ్గర  మాత్రమే చేయించుకోవాలి. లేదంటే వ్యాక్సింగ్ ను అప్లై చేయడం, అలాగే లాగడంలో తప్పులు జరిగినప్పుడు చర్మం మీద గాయాలు ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాక్సింగ్ మిశ్రమాన్ని చర్మానికి పూసేటప్పుడు దాని ఉష్ణోగ్రతను కూడా పరీక్షించుకోవాలి. లేదంటే చర్మం కాలిపోయే ప్రమాదం కూడా ఎక్కువ. అలాగే వ్యాక్సింగ్ చేసేటప్పుడు గట్టిగా లాగడం,బలవంతంగా లాగడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మంట, దురద ల కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: