వయసు పెరుగుతున్న కొద్దీ ముఖం మీద ముడతలు రావడం సహజం.. మరీ చిన్న వయసుకే ముఖంతో పాటు మెడ మీద కూడా ముడతలు వచ్చి చూడడానికి అసహ్యకరంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మెడచుట్టు బాగా నల్లగా మారిపోయి, ఏదో వికారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ, ఎన్నో ఉత్పత్తులను వాడినప్పటికీ,ప్రయోజనం లేక విసుగు చెంది ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకువచ్చాము కొన్ని చిట్కాలను. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్ లో ముంచిన కాటన్ బాల్ తో మెడను తుడిచి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసంలో,  ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. మిశ్రమాన్ని మెడకు పట్టించి,నెమ్మదిగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  ఉదయం చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు , నెలకు మూడు వారాలపాటు  చేయడం వల్ల మెడ మీద నలుపు తగ్గుతుంది. అలాగే ముడతలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి.


ఆపిల్ వెనిగర్ చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.  కీరదోస రసం చర్మాన్ని కోమలంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వీలైనప్పుడల్లా కనీసం రోజుకు ఒకసారి, ఐస్ క్యూబ్ తో మెడ మీద సున్నితంగా మర్ధనా చేయడం వల్ల క్రమంగా మెడమీద ముడతలు తగ్గి పోయే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా గ్రీన్ టీ బ్యాగులను నీటిలో అద్ది, ఆ నీటిలో ఒక కాటన్ బాల్ ఉంచి, దానిని మెడ మీద రుద్దడం వల్ల క్రమంగా నలుపు తగ్గి, చర్మం బిగుతువుగా మారుతుంది.

అలాగే ప్రతిరోజు ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తూ ఉంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇక చలికాలంలో చేతులకు ఆయిల్ తో మర్దనా చేయడం వల్ల ముడతలు తగ్గి, చేతి వేళ్లు కూడా అందంగా తయారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: