నాటి నుంచి నేటి వరకూ, ప్రతి ఒక్కరు ముఖంపైన ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారు. తీసుకునే ఆహారంలో కానివ్వండి  లేదా వారు ఎంచుకునే కాస్మెటిక్స్ లోనైనా కానివ్వండి ఎంతో శ్రద్ధ చూపిస్తూ, చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. అలాంటిది తినే విషయంలో కొన్ని తప్పులు దొర్లితే.. అది ఆరోగ్యానికే కాదు ముఖం తేజస్సును కూడా నాశనం చేస్తుంది అంటున్నారు నిపుణులు.. అయితే ఏయే పదార్థాలు తినకూడదు..ఒకవేళ తింటే ముఖం ఎందుకు పాడవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ..


మీరు ప్రతి రోజూ స్నానం చేసేటప్పుడు ఎక్కువగా కెమికల్స్ లేని సబ్బులను మాత్రమే వాడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రసాయనాలు,  ఆల్కహాల్ ఉన్న సబ్బులను వాడటం వల్ల మీ చర్మ రక్షణను కోల్పోతారు. మీరు వాడే ఉత్పత్తులలో ఓట్స్,తేనె లాంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.  ఎందుకంటే అవి తిరిగి తేమను తీసుకొచ్చి,  మీ చర్మాన్ని తాజాగా మృదువుగా ఉంచుతాయి..


ఇక స్నానం చేసిన వెంటనే చర్మం పొడిబారకుండా ఉండాలి అంటే ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ లేదా బాడీ కేర్ క్రీమ్ రాయండి. ఇలా చేయడం వల్ల శరీరం పై తేమ అలాగే ఉండి, చర్మం తాజాగా ఉంటుంది. అంతేకాకుండా మీ చర్మాన్ని బ్యాక్టీరియా, క్రిములు నుంచి కాపాడుతుంది. అయితే మీ చర్మాన్ని బట్టి మాయిశ్చరైజింగ్ క్రీములు ఎంచుకోవాల్సి ఉంటుంది.


చాలామంది కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల చర్మం లోని తేమను పీల్చుకుని చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. అలాగే కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించడమే కాకుండా వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం కూడా ఎక్కువ.


అంతేకాకుండా చాలా మంది భోజనం చేసిన తరువాత చాక్లెట్లను, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలను తింటుంటారు. వీటి వల్ల ముఖం మీద మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ.


అలాగే బేకరీ ఫుడ్స్, బర్గర్లు, నిల్వ ఉంచి తీసుకునే ఫుడ్లో క్రొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. అంతే కాకుండా త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వీటన్నింటికీ దూరంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: