ప్రతి ఒక్కరికి నలుగురిలో విభిన్నంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే రకరకాలుగా రెడీ అవుతూ ఉంటారు. అయితే సినీ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన నిధి అగర్వాల్, తన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో మనతో చెప్తాను అంటూ ముందుకు వచ్చింది.. అయితే ఈ బ్యూటీ చెప్పే ఆ బ్యూటీ టిప్స్ ఏంటో మనం తెలుసుకుందాం..
మున్నా మైకేల్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసిన ఈ బెంగళూరు అమ్మాయికి, పెద్దగా ఆశించిన స్థాయిలో బాలీవుడ్లో అవకాశాలు రాలేదు. తెలుగులో కూడా ఒకటో రెండో చేసినా అవి అనుకున్నంత పెద్ద విజయం కాలేదు. అయితే ఇటీవల రామ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించి, అందరిని మెప్పించింది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవడంతో తెలుగు, తమిళంలో అవకాశాలు పోటెత్తుతున్నాయి.. అయితే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న పీరియాడికల్ మూవీ లో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది..
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అందం గురించి కొన్ని సీక్రెట్స్ మనకు తెలియజేసింది.. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అయితే నిధి అగర్వాల్ మేకప్ వేసుకునే అమ్మాయిలను దృష్టిలో పెట్టుకుని తన సీక్రెట్ కూడా షేర్ చేసింది.. మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో, మేకప్ తీసేయడం కూడా అంతే ముఖ్యమని అంటోంది. అయితే నిధి అగర్వాల్ ముఖాన్ని ఐస్ ముక్కలతో రుద్దుతూ, మేకప్ తీసేస్తుందట. కొన్ని సందర్భాలలో కొబ్బరినూనె లేదా రోజ్ వాటర్ ను ఉపయోగించి, సకాలంలో మేకప్ ను తొలగిస్తుంది అట. కొబ్బరి నూనె వాడటం వల్ల ముఖం పొడిబారకుండా ఉంటుందని చెబుతోంది..
అలాగే మెరిసే చర్మం కోసం పెరుగు ఫేస్ ప్యాక్ కూడా చాలా మంచిదట. అయితే పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, కాసేపయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని చెబుతోంది..
చూశారు కదా ఫ్రెండ్స్ నిధి పాటించే తన బ్యూటీ టిప్స్, మీరూ కూడా పాటించి అందంగా అవడానికి ప్రయత్నించండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి