ఎన్నెన్నో ఔషధ గుణాలని తనలో నిక్షిప్తం చేసుకున్న కలిమి కలిగినది కలబంద. ఈ దళసరి పొరవున్న చెట్టలో నేయివంటి చిక్కటి పధార్థం ఉండటం వల్ల ఘృతకుమారిగా కూడా పిలవబడుతుంది. అలోవెరా అని ముద్దుగా ఆధునికులు పిలుచుకునే ఈ మొక్క అద్భుతమైన ఆరోగ్యఫలితాలనిస్తున్నది. ప్రతి రోజూ నియమానుసారంగా పావుగ్లాసు కలబంద రసం తాగితే చక్కని ఆరోగ్యం మనికి కలుగుతుంది. దీని గుజ్జు ఎన్నెన్నో వ్యాధులకు మందుగా పని చేయడమే కాకుండా చక్కని సౌందర్య పోషక ద్రవ్యంగా కూడా మంచి ఫలితాలనిస్తుంది. ఒక గుత్లిలా ఆకులు వచ్చే చిన్న మొక్క ఇది, ఈ ఆకులు పుష్టిగా, లావుగా రసభరితంగా చూడ్డానికి ఒక చాకులా ఉండి 24-50 సెంటీమీటర్ల పొడవు, 4-8 సెంటిమీటర్ల వెడల్పు కలిగివుంటాయి ఆ ఆకులు అంచుల్లో ముళ్ళవంటి వుంటాయి. చర్మ సౌందర్య పోషకం : ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని ఉద్యానవనాల్లోనూ పొలాలగట్లమీద పెరుగుతుంటాయి. ఈ ఆకు విరిస్తే తెల్లని, పచ్చని స్రావం బయటకి వచ్చి కొంచెం సేపు తరువాత గట్టిపడుతుంది. దీన్ని వేడిచేస్తే పల్చని ద్రవంగా తయారవుతుంది.Hepatic Aloes అంటారు. తీవ్రమైన మంటలో వేడిచేస్తే మీరీ పల్చనకాని పధార్థంగా మారి Gassy Aloes గా పిలవబడుతుంది. రుచికి చిరుచేదుగా వుంటి జిగురు గుణం కలిగి చలవని చేస్తుంది. మొత్తానికి ఈ కలబంద మందులా ఆహారంలోనే కాకుండా మొటిమలనుండి చర్మసౌందర్య పోషకంగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఇ. సి, బి1, 2,3, కాకుండా బి6, ఐరన్, కాల్షియం, జింక్ కూడా కలిగివున్న అత్యంత పోషకపధార్థం. దీనిలో ఏడు అత్యంత అవసరమైన ఎమైనోయాసిడ్ లు ఉండటంవల్ల జీర్ణశక్తికి మంచి టానిక్ లాంటది. ఇది శరీరంలో చెడును యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. బరువును నియంత్రిస్తుంది : ఆహారపరిణామంవల్ల వంటపట్టే ప్రక్రియవల్ల శరీరంలో తయారయ్యే వివిధ విషపధార్థాలన్ని ఇది తొలగించి శుభ్రపరచగలదు. మలబద్దకాన్ని తొలగిస్తుంది. లోపల పూర్తిగా జీర్ణంకాక ఆకలి లేనపుడు ఈ కలబంద స్వరసం తాగితే జీర్ణమై ఆకలిపుడుతుంది. కడుపులో పుండు అల్సర్స్, తరచూ విరేచనాలు అయ్యే ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి వ్యాధులలో ఈ రసం కాస్త క్లేదపరచి వ్యాధిని తగ్గిస్తుంది.. కలబంద స్వరసం రెండు మూడు చెంచాలు రోజూ పరగడున తీసుకుంటే పెప్పిన్ అనే ఎంజైమ్ విడుదలై జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకశక్తిని కూడా పెంచి లోపల వున్న టాక్సిన్లను తొలగిస్తుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకశక్తిని కూడా పెంచి లోపల ఉన్న టాక్సిన్లను తొలగిస్తుంది. ఇది ఎటువంటి ఉపద్రవాలని, సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగించకుండా కండరాలని, కీళ్ళని ఉత్తేజపరచి నొప్పులు లేకుండా చేస్తుంది. కలబందరసం చర్మ సౌకుమార్యాన్ని పెంచడమే కాకుండా బాగా పెరగడానికి దోదపడుతుంది. ఇది ప్రతిరోజూ తీసుకోవడంవల్ల మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ సమపాళ్ళలో లభిస్తాయి. ఇది మనలో శక్తిని పెంచి శరీరం బరువుని కూడా నియత్రిస్తుంది. కలబంద స్వరసం గుండెల్లో మంటని, కీళ్ళు బిగుసుకు పోవడం వంటి లక్షణాలని తగ్గించడంతోపాటు షుగరువ్యాధిగ్రస్తులకి రక్తంలో షుగరు ని నియంత్రిచడంలో సహాయపడుతుంది. రోజూ ఇది తీసుకోవడంవల్ల మీకు తెలియకుండానే మీ పళ్లు, చిగుళ్లు గట్టిపడతాయి. పడివయసు స్త్రీలు రోజూ కొంచెం రసం తాగుతుంటే వారి జననేంద్రియాలన్నీ బలపడతాయి. జారిన లేదా సున్నితమైపోయిన వాళ్ళ అవయవాలు గట్టిపడతాయి. ఇలా వాడాలి: తరచు జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, కొద్దిగా ఆయాసం ఉన్నవాళ్ళు ఈ స్వరసం తీసుకోవడం చాలా ఉపయోగం. రోజూ ఇది తీసుకోవడం చాలా ఉపయోగం రోజూ ఇది తీసుకోవడం షుగరువ్యాధి గ్రస్తులకి హితకరం. ఇది మీరు వాడుతున్న మందులతో తగ్గకుండా వుండే షుగరు తగ్గుతుంది. ఇది ఒళ్లు తగ్గించడంలో అద్భుతఫలితాలని చూపిస్తున్నది. కలబందతో చేసిన లేపనం పగుళ్ల, కురుపులు మాన్పడంలో చక్కగా పనిచేస్తుంది. ఈ కలబందరసం చేదుగా ఉండటంవల్ల తీసుకోవడం కష్టం. అందువల్ల పళ్లరసంలోనో, కాయగూరల రసంలోనో కలిపి తీసుకోండి. రోజూ కనీసం రెండు ఔన్సుల రసం అలాగే రసంలా గాని దేనితోనో కలిపి కాని తీసుకోవచ్చు. క్రమంగా అవసరాన్నిబట్టి రెండు నుంచి పెంచుతూ నాలుగు ఔన్సుల దాకా తీసుకోవచ్చు. కలబంద చర్మసౌందర్యాన్ని ఇనుమడింపచేసే చక్కని మందు. దీని జిగురు పగుళ్లు, పుండ్లమీద రాస్తే చల్లబరిచి మాన్పుతుంది. ఒక అరకప్పు కలబందరసం, అరకప్పు కొబ్బరి పాలు, అరకప్పు గోధుమతో చేసిన రసంతో కలుపుకుంటే చక్కని షాంపూతయారవుతుంది. ఇది తలపై ఉన్న చుండ్రుని తగ్గించి జుట్టుని నిగనిగలాడుతూ ఉంచుతుంది. రక్తప్రసరణ చక్కగా జరగటంలోనూ, మనలో ఓజోశక్తి పెంచడంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద మందు మాత్రమే కాదు కొద్దిగా తీసుకుంటే పోషకాహారం కూడా !

మరింత సమాచారం తెలుసుకోండి: