ఎండాకాలం వచ్చేసింది. ఇక ఈ కాలం వచ్చిందంటే చాలు మీ ముఖం ఆటోమాటిక్ గా వాడిపోతుంది. ఇక మనం ఒక్కసారి బయటకి వెళ్లి వచ్చాము అంటే టాన్ అయిపోతాము. అలా టాన్ అయిపోవడం వల్ల మన బ్యూటీ పోతుంది. కాబట్టి మన బ్యూటీ ని కాపాడుకోడానికి ఖచ్చితంగా ఇవి పాటించండి.ఇంట్లో ఎంత ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్ళినా బయటకి వెళ్ళి అరగంట అయ్యేప్పటికి మళ్ళీ స్నానం చేయాలేమో అన్నంత చెమట పట్టేస్తుంది. కొంచెమైనా ఫ్రెష్ గా ఉండాలంటే పెర్ఫ్యూమ్ కానీ డియోడరెంట్ కానీ మీ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళాక వాడండి.ఎండ నుండి కళ్ళకి కూడా ప్రొటెక్షన్ కావాలి, ఒక్కోసారి బయట ఎండకి కళ్ళు బైర్లు కమ్మినట్లు అయిపోతాయి. అలాంటప్పుడే సన్‌గ్లాసెస్ మనని రక్షిస్తాయి.కాబట్టి సన్ గ్లాసెస్ ని తప్పనిసరిగా పెట్టుకోండి.


మంచి నీళ్ల బాటిల్ తప్పని సరి. దాహం వేసి, ఆ దగ్గరలో నీరు ఉండక అవస్థ పడడమో, లేదా కూల్ డ్రింక్ తాగడమో లాంటి ఆప్షన్స్ కంటే బ్యాగ్ లో ఒక చిన్న వాటర్ బాటిల్ ఉండడం ప్రశాంతంగా ఉంటుంది.సన్‌స్క్రీన్ యూజ్ చేయడం వల్ల సూర్యుని తీక్షణమైన కిరణాల నుండి ప్రొటెక్షన్ లభిస్తుంది. అంతే కాక, స్కిన్ బ్లాచీగా అయిపోవడం వంటి, కలర్ మారిపోవడం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. లిప్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి.సన్ డ్యామేజ్ ని ఇవి తట్టుకోలేవు. అందుకే ఎప్పుడూ మీ లిప్స్ హైడ్రేటెడ్ గా ఉండాలి. కాబట్టి ఎస్‌పీఎఫ్ ఉన్న మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి, రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉండండి.జుట్టులో కూడా చెమట పట్టు, జుట్టు తలకి అతుక్కుపోయి విచిత్రంగా కనిపించకుండా డ్రై షాంపూ హెల్ప్ చేస్తుంది. ఈ షాంపూని కుదుళ్ళ దగ్గర స్ప్రే చేసి దువ్వితే జుట్టు చాలా అందంగా ఉంటుంది. ఇక ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి...

మరింత సమాచారం తెలుసుకోండి: