ఈ రోజుల్లో చాలా మందికి చిన్న తనం నుంచే తెల్ల వెంటుకలు వచ్చేస్తున్నాయి.అయితే సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.అందువల్ల తల వెంటుకలు తెల్లగా మారతాయి. కానీ, ఈ సమస్య ముందుగానే వస్తే .. ఇక చిన్న వయస్సులోనే ఈ తెల్ల వెంటుకలు వస్తాయి. అయితే, ఈ తెల్ల వెంటుకల సమస్యను మీరు ముందుగా గుర్తించినప్పుడే దానిని పరిష్కరించడం సాధ్యమవుతుంది.ఇక కొంత మందిలో ముందుగానే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.అందుకే వారి జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఇక చాలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒత్తిడి, రెండోది పోషకాహార లోపం అని చెప్పాలి.ఈ రెంటి సమస్యని అధిగమిస్తే మీరు తప్పకుండా తెల్ల జుట్టు సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు.

అలాగే ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా మంచి జుట్టుకి తగిన పోషకాలను తీసుకోవాలి. అప్పుడే మన జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.అలాగే కొన్ని సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే పాంటోథెనిక్ ఆమ్లం అని కూడా పిలువబడే  విటమిన్ B 5 జుట్టు తెల్లబడే ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం చాలానే ఉంది. కాబట్టి వైద్యుల సూచన తీసుకుని.. ప్రతి రోజూ కూడా 100-200 మిల్లీగ్రాముల కాల్షియం పాంతోథెనిక్ ఆమ్లం తీసుకోవడం ద్వారా ఈ తెల్ల జుట్టు సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు. అయితే, ఈ సప్లిమెంట్లను ఇష్టానుసారం తీసుకోకూడదని, వైద్యులు సూచించే బ్రాండ్లు, మోతాదుల ప్రకారమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ పద్ధతులు పాటించండి.చిన్న తనం నుంచే తీవ్రంగా బాధ పడుతున్న తెల్ల జుట్టు సమస్యని ఈజీగా అదిగమించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: