మొటిమలు ని తొలగించడం ఒక టాస్క్ అయితే వాటి వల్ల ఏర్పడిన మచ్చలను  తొలగించడం ఇంకా పెద్ద టాస్క్.

క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ మైంటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నెన్నో జాగ్రత్తలు పాటిస్తుండాలి. మొటిమల వల్ల వచ్చిన మచ్చలేని తగ్గించడానికి ఈ ఇంటి చిట్కా ను పాటించి చూడండి.


చిట్కా: మీ ముఖానికి సరిపడా  బియ్యం పిండి(వరి పిండి)  తీసుకోండి. ఆ పిండిలో కొద్దిగా తేనే వేసి  ఐస్ ముక్కలు లేదా చల్లని నీళ్లు పోసుకుని ఒక పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడుక్కుని ఈ ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ ఆరేంతవరకు హాయిగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవండి.

( రెండు సన్నని కీరా ముక్కలు కళ్ళకి పెట్టుకోవచ్చు) ఫేస్ ప్యాక్ ఎండి పోయిన చల్లని నీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఒక మెత్తని పొడి టవల్ తో ముఖాన్ని అదుకోవాలి. ముఖం తడి ఆరిన తర్వాత  కొన్ని రోజ్ వాటర్ చుక్కలు తీసుకుని లైట్ గ మసాజ్ చేస్తూ ముఖం అంతా రాసుకోవాలి.

ఇలా వారానికొకసారి క్రమంగా చేస్తుంటే ముఖం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి.


బియ్యం పిండి ని చర్మానికి ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బియ్యం పిండి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది

యూవీ రేస్ వల్ల కలిగే డ్యామేజ్ ను బియ్యం పిండి తగ్గిస్తుంది.

బియ్యం పిండి స్కిన్ ఏజింగ్ నుండి కాపాడుతుంది.

బియ్యం పిండి చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

డార్క్ సర్కిల్స్ తగ్గించడం లో బియ్యం పిండి ఎంతో  సహాయ పడుతుంది.

చర్మంలో ఉన్న ఎక్స్పెన్సివ్ ఆయిల్ ను బియ్యం పిండి అబ్సర్వ్ చేసుకుంటుంది.

బియ్యం పిండి చర్మం యవ్వనంగా, తాజాగా  కనిపించేలా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

చర్మంలో వచ్చే ముడతలు బియ్యం పిండి దూరం చేస్తుంది.


గమనిక: పురుగు ఉన్న బియ్యం పిండి ని వాడకండి. బియ్యం పిండి మీ స్కిన్ కు 

పడుతుందో లేదో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. సెన్సిటివ్ స్కిన్ మరియు ఏదైనా స్కిన్ అల్లెర్గిఎస్  ఉన్నవారు జాగ్రత్త, ఏదైనా రియాక్షన్, స్కిన్ ఇరిటేషన్ వంటివి వస్తే మీ డాక్టర్ ను సంప్రదించండి) 

మరింత సమాచారం తెలుసుకోండి: