ముఖం ఎంత అందంగా ఉన్నప్పటికీ తాజాగా లేకపోత కళ అనేది కనిపించదు. దాంతో మొహం ఫ్రెష్ గా ఉండదు. చాలా మంది జిడ్డు మొహంతో బాధపడుతూ ఉంటారు. నలుగురి లోకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని సార్లు ముఖం కడిగినా ప్రయోజనం లేదంటూ రెండు నిమిషాలకి మళ్ళీ తిరిగి ముఖంపై నూనె పోసినట్లు అయిపోయి  జిడ్డు జిడ్డుగా చూడటానికి అసలు బాగా అనిపించదు. ఎంత మేకప్ వేసుకున్నప్పటికీ ఆ జిడ్డు కారణంగా మళ్ళీ ముఖంలో కాంతి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు ఆయిల్ ఫేస్ ఉన్న వారు ఎంత మంచి కలర్ లో ఉన్నా కాస్త రంగు తక్కువ గానే కనిపిస్తారు. ఇలా కాకుండా మీ ముఖం తాజాగా అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు కొందరు బ్యూటీషన్లు. అవేంటో ఒకసారి చూద్దాం పదండి.

* ఆయిల్ ఫేస్ తో బాధపడే వారు ఎప్పుడూ కూడా శనగ పిండి, సున్ని పిండి వంటి వాటిని రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి.

* మేకప్ వేసుకునే అలవాటు ఉండే వారు పడుకునే ముందు ఖచ్చితంగా మేకప్ తీసేసి వారి ముఖాన్ని శుభ్ర పరుచుకునే పడుకోవాలి. లేదంటే చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలు కూడా మూసుకుపోతాయి.

*ఎక్కడికైనా హడావిడిగా పార్టీకి వెళ్ళాలి అంటే ముందుగా ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్ర పరుచుకొని, స్క్రబ్ చేసి అనంతరం ఆవిరి పడితే చర్మం లోని మృత కణాలు అలాగే దాగి ఉన్న బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్లిపోతుంది.

*వీలైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. తాజాగా ఉన్నటువంటి పండ్లు కూరగాయలను తీసుకోవడం వీలైతే వండకుండా పచ్చిగా ఉన్నప్పుడు తినేయడం మన చర్మ సౌదర్యానికి మరీ  మంచిది.

మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే పైన చెప్పిన చిట్కాలను పాటించి జిడ్డు ముఖం నుండి బయట పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: