మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో  కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. కరివేపాకు వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి.అలాగే జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఇంకా నల్లగా పెరుగుతుంది. ఇక జుట్టుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో బాధపడే వారు ముందు జుట్టుకు తగినంత కరివేపాకును తీసుకోవాలి.ఆ తరువాత కరివేపాకును బాగా శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో పెరుగును కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఆ తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.ఇంకా అలాగే చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.ఇంకా అలాగే జుట్టుకు కావల్సినంత తేమ అంది జుట్టు పొడిబారడం కూడా చాలా ఈజీగా తగ్గుతుంది.


ఇంకా జుట్టు మృదువుగా తయారవుతుంది. అలాగే కరివేపాకుతో జుట్టు సమస్యలను తొలగించే మరో టిప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కరివేపాకును తీసుకుని బాగా కడగాలి. తరువాత దానిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోని ఆ తరువాత దీని నుండి రసాన్ని తీయాలి. ఈ కరివేపాకు రసంలో తగినంత షాంపును కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పొడవుగా ఇంకా నల్లగా పెరుగుతుంది.ఇంకా అలాగే జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా కరివేపాకుతో టిప్ తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇంకా అందమైన, ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: