జుట్టును ఒత్తుగా ఇంకా నల్లగా ఉంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కూడా. ఈవిధంగా జుట్టు సమస్యలతో బాధపడే వారు ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. ఒక చక్కటి చిట్కాను వాడడం వల్ల చాలా ఈజీగా జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. జుట్టును అందంగా, నల్లగా ఇంకా ఆరోగ్యంగా మార్చే ఈ చిట్కా ఏమిటి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి  మనం గురివింద గింజలను ఉపయోగించాల్సి ఉంటుంది.ఇవి మనకు పొలాల దగ్గర, చేల కంచెల వెంబడి విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ఇంకా అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ గురివింద గింజలు మనకు లభిస్తాయి.ఈ గురివింద గింజలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి.ఇంకా అలాగే వీటిలో చాలా ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ గింజలను ఉపయోగించడం వల్ల మనం జుట్టు సమస్యలన్నింటిని ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా గురివింద గింజలను జార్ లో వేసి పప్పు లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ పప్పును మందంగా ఉండే వస్త్రంలో వేసి మూట కట్టాలి. ఆ తరువాత ఒక గిన్నెలో అర గ్లాస్ పాలను తీసుకోవాలి.


 ఇందులో గురివింద గింజల మూట వేసి పాలు పూర్తిగా ఆవిరై పోయే దాకా మరిగించాలి. తరువాత ఆ మూటను తీసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరో గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను మీరు తీసుకోవాలి.తరువాత ఇందులో ఒక టీ స్పూన్ గుంటగలగరాకు పొడిని వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఉడికించిన గురివింద గింజల పప్పు కూడా వేసి కలపాలి. ఇక ఇప్పుడు ఈ నూనెను చిన్న మంటపై వేడి చేయాలి. నూనె మరిగిన తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ నూనెను వడకట్టి స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లల్లోకి బాగా ఇంకేలా బాగా పట్టించాలి. దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచుకుని ఉదయయాన్నే తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. ఇంకా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. దురద, చుండ్రు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ టిప్ ని వారానికి రెండు సార్లు వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: