మన పెద్దవారికి వయసు పెరిగే కొద్ది తెల్ల జుట్టు సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల  వయసులో కూడా తెల్ల జుట్టు సమస్యలు ఈజీగా వస్తున్నాయి.ఇటువంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అతిగా రసాయనాలు కలిగిన ప్రోడక్ట్స్‌ వాడటం ఇంకా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం తెల్ల జుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన భృంగరాజ్ మూలికతో తయారు చేసిన నూనెను వాడాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా చేయడమే కాకుండా ఇంకా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద గుణాలు కలిగిన నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇంట్లోనే ఈజీగా భృంగరాజ్ నూనెను తయారు చేసుకుని వినియోగించవచ్చు. ఇందు కోసం ముందుగా ఓ చిన్న బౌల్‌ ని తీసుకుని అందులో నువ్వుల నూనెలో కొన్ని బృంగరాజ్ ఆకులను వేసి బాగా మరిగించుకోవాలి.


ఇలా ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఫిల్టర్‌ చేసి గాజు సీసాలో భద్రపరుచుకుని మీకు కావాల్సిప్పుడు వాడుకోవచ్చు.తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడానికి  బృంగరాజ్‌తో తయారు చేసిన నూనెను క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఈ నూనెను తీసుకుని జుట్టుకు బాగా అప్లై చేసి ఒక నాలుగు నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత గంటసేపు జుట్టుకు రెస్ట్‌ ఇచ్చి ఆయుర్వేద గుణాలు కలిగిన షాంపుతో బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.అలాగే బృంగరాజ్ ఆకులను కూడా తెల్ల జుట్టుకు వాడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను వాడే ముందు వీటిని బాగా ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పొడిలా తయారు చేసుకుని అందులో నీటిని కలిపి మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత తెల్ల జుట్టుకు మీరు అప్లై చేయాలి. అప్లై చేసి రెండు గంటలు అలాగే ఉంచి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: