తెల్ల జుట్టు సమస్య కారణంగా చిన్న వారు కూడా పెద్ద వాళ్ల లాగా కనిపిస్తారు. అందుకే ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా అయినప్పటికి దీర్ఘకాలం పాటు వీటిని వాడడం వల్ల మనం కచ్చితంగా చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే హెయిర్ డైలను వాడడానికి బదులుగా సహజ చిట్కాలను వాడడం మంచిది.ఈ టిప్ ని తయారు చేసుకోవడం వల్ల చాలా సులభం. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఈ టిప్ అద్భుతంగా పని చేస్తుంది. ఈ టిప్ ని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే దీనిని తయారు చేసుకోవడానికి మనం కేవలం రెండంటే రెండు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక తెల్ల జుట్టును నల్లగా మార్చే ఆయుర్వేద చిట్కా గురించి అలాగే దీనిని తయారు చేసుకోవడానికి కావల్సిన రెండు పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కరివేపాకును ఇంకా ఉల్లిపాయను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా గుప్పెడు కరివేపాకును తీసుకుని దానిని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత తరువాత ఇందులో ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి కలపాలి.ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది.కరివేపాకు ఇంకా ఉల్లిపాయ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు అందంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా తెల్ల జుట్టు సమస్యతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: