ఈ చలి కాలంలో ఖచ్చితంగా జుట్టు, చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. పాడై పోయిన జుట్టుకు చికిత్స అందించడానికి ఇంకా చర్మ సమస్యలను దూరం చేయడానికి కొన్ని నూనెలు ఉపయోగపడతాయి. ఇక చలికాలంలో చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఈ కింది నూనెలను ఎంచుకోవచ్చు. ఇవి చర్మం, జుట్టు రెండింటికీ బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొబ్బరి నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం పై పొరను ఏర్పరచి, చర్మం తేమను నిలుపుకునేలా చేస్తుంది. పొడి చర్మానికి ఈ నూనె చాలా మంచిది. చలికాలంలో కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ నూనె జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది.అలాగే ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఈ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల మూలాలు కూడా బలపడతాయి.


జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా మారుస్తుంది.ఇంకా బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ నూనె పొడి చర్మ సమస్యలతో పోరాడుతుంది. అలాగే చర్మానికి తేమను అందిస్తుంది. బాదం నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది.ఆర్గాన్ ఆయిల్‌లో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె చర్మానికి పోషణనిచ్చి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.ఆర్గాన్ ఆయిల్ దాని యాంటీఆక్సిడెంట్ల వల్ల శీతాకాలంలో చర్మానికి హాని కలిగించదు. ఆర్గాన్ ఆయిల్ చర్మంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఈ నూనె జుట్టుకు పోషణతోపాటు కండిషన్ కూడా ఇస్తుంది. ఆర్గాన్ ఆయిల్ జుట్టుకు సహజ మెరుపును ఇస్తుంది. అలాగే ఈ నూనె జుట్టు చిట్లడం వంటి సమస్యలను తొలగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: