ఎంత అందమైన ఫేస్ అయినా మంగు మచ్చలు వచ్చాయాంటే అందహీనంగా కనిపిస్తారు.ఈ మచ్చలు ఒకసారి వచ్చాయంటే తగ్గటం చాలా కష్టం.ఈ మంగు మచ్చలు వచ్చేటప్పుడు కానీ పోయే టప్పుడు కానీ మనకి కష్టాలు తెచ్చిపెడుతుందని కొంతమంది చెప్తుంటారు.ఈ మచ్చలతో ఎక్కడకి పోలేము.బయట తిరగలేము. నలుగురిలో తిరగాలంటే ఏదోలా ఉంటుంది.అది కాక ఈ మచ్చలు వచ్చినపుడు స్కిన్ దురదగా మంటగా ఉంటుంది.సూర్య కిరణాలు పడటం వల్ల సమస్య ఇంకా ఎక్కువవుతుంది.అందుకే ఎక్కువ సేపు ఎండకి ఉండలేము.శరీరం లో మెలనీన్ అనే బాడ్ ద్రవ్యం రిలీస్ అవడం వల్ల ఈ సమస్య ప్రారంభమవుతుంది. సూర్య కిరణాలు తగిలినప్పుడు ఈ మెలనీన్ ఇంకా ఎక్కువగా రిలీస్ అవుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవాళ్లు ఎండలో ఎక్కువ సేపు గడపలేరు. సోప్స్ మరియు ఫేస్ క్రీమ్స్  పెద్దగా ఈ మెలనిన్ సమస్యని అరికట్టలేవు.అయితే ఈ మచ్చలకి ఇంట్లోనే పరిష్కారం పొందవచ్చని మీకు తెలుసా. మనం రోజు ఇంట్లో వాడే కొన్ని ఇంగ్రీడియన్స్ తో ఈ మచ్చలని పూర్తిగా పోగొట్టుకోవచ్చు.


మనం తినే బంగాళాదుంపలో ఈ మంగు మచ్చని తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి.తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి అది ఎలానో చూద్దాం. బంగాలదుంపలు  తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. బంగాళాదుంప తో కూరలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. మరి ఈ బంగాళాదుంపలతో తీసిన రసం వల్ల ఈ మచ్చలని పోగొట్టుకోవచ్చు.ఇంకా త్వరగా మచ్చలు తగ్గాలి అంటే ఒక ఐదు బంగాళాదుంపలని తీసుకొని వాటిని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఈ తురుముని ఒక పల్చటి క్లాత్ లో వేసి పిండితే కొంత రసం వస్తుంది. దీనిలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ తేనే, రెండు ఇ విటమిన్ కాప్సిల్స్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.ఉదయం లేవగానే రోజు ఒక ఐస్ క్యూబ్స్ మంగు మచ్చలు ఉన్న చోట బాగా పట్టించి రుద్ది మసాజ్ లా చేసుకోవాలి. డైలీ ఇలా చేయడం వల్ల రిజల్ట్ త్వరగా తెలుస్తుంది.దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీలో ఎవరైనా ఈ మంగు మచ్చల సమస్య వల్ల బాధపడుతూ ఉంటే ఇలా చేసి చుడండి.కొద్ది రోజుల్లోనే సమస్య తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: