గుడ్డులోని తెల్లసొన చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మానికి పోషణ ఇచ్చి ముడతలు పడకుండా చూస్తాయి. అలాగే చర్మానికి అవసరమైన ఇతర పోషకాలు కూడా ఈ తెల్ల గుడ్డు సొనలో లభిస్తాయి.ఈ ఫలితాన్ని పొందడానికి.. ఎగ్ వైట్ లో కొద్దిగా మిల్క్ క్రీం, కొన్నిచుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.బంగాళాదుంపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం యవ్వనంగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెరిగేలా చేస్తుంది.ఇంకా అలాగే గిన్నెలో టీస్పూన్ శెనగపిండి, అరకప్పు పాలు, ఒక స్కూప్ తేనె తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.


ఈ మాస్క్ ను 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఈ సమయంలో దాన్ని అస్సలు తాకకూడదు. నిర్ణీత సమయం తర్వాత మైల్డ్ సోప్ ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. శెనగపిండి, పాలు, తేనె.. ఈ మూడు పదార్థాల్లోనూ సహజ సిద్ధమైన ఎక్స్ఫోలియేటింగ్ గుణాలున్నాయి. ఇవి చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెలను తగ్గిస్తాయి.ఇంకా అంతేకాదు చర్మకణాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి..రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలా తెల్లగా అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: