ముఖాన్ని అందంగా మార్చుకోడానికి ఒక గుడ్డులో అవిసె గింజల పొడి వేసి కలిపి చర్మానికి రాసుకోవాలి. ఆరిన తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది. అదే విధంగా 4 గంటల పాటు నానబెట్టిన అవిసె గింజలను రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల మెరిసే చర్మం సొంతమవుతుంది.అవిసె గింజల జెల్ ను ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే దద్దుర్లు, ఎరుపుదనం, వాపు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. చర్మంపై ఉండే సన్నటి గీతలు తొలగిపోతాయి.అవిసె గింజలను ఉడికించగా వచ్చిన జెల్ ను ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. నానబెట్టిన అవిసె గింజలను నీటిలో వేసి ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల నీటిపై జెల్ గా తయారవుతుంది. ఈ జెల్ గిన్నెలోకి తీసుకుని చల్లారినివ్వాలి. జెల్ చల్లారిన తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని జెల్ ను రాసుకోవాలి. ఇది ఆరిన తరువాత మరలా జెల్ ను రాసుకోవాలి.ఇలా రెండు సార్లు రాసుకున్న తరువాతపూర్తిగా ఆరనివ్వాలి. తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


అందమైన చర్మం కావాలనుకునే వారు అవిసె గింజలను వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. రోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.అందంగా కనిపించాలనుకునే వారు, యవ్వనంగా కనిపించాలనుకునే వారు ఇలా బ్యూటీ పార్లర్ కు డబ్బులు ఖర్చు పెట్టడానికి బదులుగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థరైటిస్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.ఇవి మన చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది జుట్టు పెరుగుదలకు అవిసె గింజలను వాడుతూ ఉంటారు.  అవిసె గింజలను వాడడం వల్ల మనం అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే చాలా కాలం వరకు యవ్వనంగా కనిపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: